News November 27, 2024
ఇసుక లభ్యత పెంచండి: సీఎం చంద్రబాబు
APలో ఇసుక లభ్యత, అక్రమాల నియంత్రణపై CM చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక డిమాండ్ దృష్ట్యా లభ్యత పెంచాలని అధికారులకు సూచించారు. ఇసుక రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి శాండ్ కమిటీలు, అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బంది పెట్టవద్దని, ధరల కట్టడికి పున:సమీక్ష చేయాలని స్పష్టం చేశారు. ఇసుక రవాణా, తవ్వకం వ్యయం తక్కువ ఉండేలా చూడాలన్నారు.
Similar News
News December 11, 2024
సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణులకు సీఎం విషెస్
TG: రాష్ట్రంలో సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన 20 మందికి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. సింగరేణి సహకారంతో ప్రభుత్వ ఆర్థిక సాయం అందుకొని సివిల్స్ ప్రధాన పరీక్షల్లో రాణించడం తమకు గర్వకారణమని తెలిపారు. ఒక చిరు దీపం కొండంత వెలుగును ఇస్తుందని, ప్రభుత్వ చిరు సాయం గొప్ప ఫలితాలను అందించిందని పేర్కొన్నారు.
News December 11, 2024
ఇందిరమ్మ ఇళ్లపై BIG UPDATE
TG: ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తులను పక్కాగా పరిశీలించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ‘ఈ నెల 31లోపు పరిశీలన చేసి, వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. ప్రతి 500 మందికి ఒక సర్వేయర్‌ను నియమించుకోవాలి. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు వేయాలి. ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి’ అని సూచించారు.
News December 11, 2024
బియ్యం అక్రమాలపై అవసరమైతే పీడీ యాక్టు: CBN
AP: బియ్యం స్మగ్లింగ్ వంటి అక్రమ చర్యలను నియంత్రించేందుకు అవసరమైతే పీడీ యాక్టును వాడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై ఉందని పేర్కొన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు సొమ్మును 24 గంటల్లోపే రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్ రైస్ తినని వారికి ప్రత్యామ్నాయం చూసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.