News July 11, 2024
ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెంపు

మేజర్ ప్రైవేట్ కంపెనీలు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను పెంచేశాయి. HDFC లైఫ్, ICICI ప్రూడెన్షియల్, బజాజ్ అలియాంజ్, మాక్స్ లైఫ్, టాటా AIA లాంటి కంపెనీలు 10 శాతం వరకు పెంచాయి. ద్రవ్యోల్బణం, రిస్క్ కవరేజి ఎక్కువగా ఉండే టైర్-2, 3 సిటీలలో డిమాండ్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. అయితే LIC, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియాన్ని పెంచే అవకాశం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News February 11, 2025
PM ఫ్రాన్స్ పర్యటనలో చేసుకునే రక్షణ ఒప్పందాలివే

ఫ్రాన్స్‌నుంచి 26 రఫేల్-ఎం యుద్ధవిమానాలు, 3 స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్లను నేవీ కోసం కొనుగోలు చేయాలని భారత్ సూచనప్రాయంగా నిర్ణయించింది. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఈ ఒప్పందం పూర్తికానుంది. ఫైటర్ జెట్స్ ఒప్పందం విలువ రూ.63వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా. INS విక్రాంత్, INS విక్రమాదిత్య నౌకలపై వీటిని మోహరించనున్నారు. ఇక 3 సబ్‌మెరైన్ల కొనుగోలు విలువ రూ.33,500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
News February 11, 2025
ప్రభాస్ ముగ్గురు చెల్లెళ్లను చూశారా?

దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, ముగ్గురు కూతుళ్లు(ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి) బంధువుల పెళ్లిలో దిగిన ఫొటో వైరలవుతోంది. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ వేడుకకు హాజరుకాలేదు. ఈ క్రమంలో చెల్లెళ్లంతా కలిసి డార్లింగ్‌కు త్వరగా వివాహం జరిపించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కొడుకే ప్రభాస్. ఇతనికి అన్న ప్రబోధ్(నిర్మాత), సోదరి ప్రగతి ఉన్నారు.
News February 11, 2025
రామ్మోహన్ నాయుడుకు ‘యువ వక్త’ పురస్కారం

AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అరుదైన గుర్తింపు లభించింది. పుణేలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ ఆయనకు ‘ఉత్తమ యువ వక్త ఆఫ్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్’ అవార్డును ప్రదానం చేసింది. అతి పిన్న వయస్సులో ఎంపీగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రామ్మోహన్ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారని నిర్వాహకులు కొనియాడారు. కాగా ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన తెలిపారు.