News November 28, 2024
వీలైనంత త్వరగా పింఛన్ల పెంపు: మంత్రి
TG: దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మంత్రి సీతక్క అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడలను మంత్రి ప్రారంభించారు. బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Similar News
News December 11, 2024
ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్
AP: ప్రజలకు అవసరమైన పాలసీలు మాత్రమే తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. అందుకే ఐఏఎస్, ఐపీఎస్‌లు బాధ్యతగా పనిచేయాలి. మమ్మల్ని నమ్మి ప్రజలు మాకు భారీ విజయం కట్టబెట్టారు. వారికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
News December 11, 2024
బాధ్యతలు స్వీకరించిన RBI కొత్త గవర్నర్
IAS అధికారి సంజయ్ మల్హోత్ర RBI 26వ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి మూడేళ్ల వరకు ఆయన సేవలందిస్తారు. ‘పీస్‌టైమ్ జనరల్’గా పేరున్న ఆయన భారత ఎకానమీని పరుగులు పెట్టించాల్సి ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. జనవరిలో రెపోరేటును తగ్గిస్తారని తెలుస్తోంది. రెవెన్యూ సెక్రటరీగా ఆయనకు మంచి అనుభవం ఉంది. ట్యాక్సేషన్, ఎకానమీ అంశాలపై పట్టుంది.
News December 11, 2024
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. అగ్రస్థానంలో ఎవరంటే..
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. వరస సెంచరీలతో హోరెత్తిస్తున్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 898 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా జో రూట్(897), కేన్ విలియమ్‌సన్ (812), యశస్వీ జైస్వాల్(811), ట్రావిస్ హెడ్(781) నిలిచారు. ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు మ్యాచుల్లో రాణిస్తే జైస్వాల్ అగ్రస్థానానికి చేరుకునేందుకు ఛాన్స్ ఉంది.