News September 10, 2024
పెరిగిన డిమాండ్.. బంగారం, వెండి ధరలకు రెక్కలు
గోల్డ్, సిల్వర్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. జువెల్లర్స్ కొనుగోళ్లు చేపట్టడమే ఇందుకు కారణం. 99.9% స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.74,100గా ఉంది. కిలో వెండి ధర రూ.700 ఎగిసి రూ.84,500 వద్దకు చేరింది. క్రితం సెషన్లో రూ.73,350 వద్ద ముగిసిన 99.5% ప్యూర్ గోల్డ్ రూ.400 పెరిగి రూ.73,750గా ఉంది. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోతను బట్టి మున్ముందు ధరల్లో మార్పు రావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News October 7, 2024
రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ?
రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే హోంమంత్రి సమావేశంలో వీరిద్దరూ పాల్గొంటారు. అనంతరం వీరిరువురూ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే రేవంత్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్తారు.
News October 7, 2024
భారత యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా భారత యువతి పూజను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు పూజ ఇస్లాం మతాన్ని స్వీకరించనున్నట్లు రజా తెలిపారు. కాగా 32 ఏళ్ల హసన్ రజా పాక్ తరఫున ఒక వన్డే, 10 టీ20లు ఆడారు. అనంతరం ఆయన యూఎస్‌లో స్థిరపడ్డారు. పూజ ఫ్యామిలీ కూడా అక్కడే స్థిరపడింది.
News October 7, 2024
గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ ఆందోళన
INDvBAN టీ20 మ్యాచ్ జరిగిన గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ కార్యకర్తలు నల్ల జెండాలతో ఆందోళన చేశారు. బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతుంటే, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటంటూ నినాదాలు చేశారు. మ్యాచ్ దృష్ట్యా ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయరాదంటూ స్థానిక జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ నిరసనకారులు లెక్కచేయకపోవడం గమనార్హం. వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.