News July 29, 2024

పెరిగిన ధరలు.. ఆచితూచి కొంటున్న ప్రజలు

image

TG: కూరగాయల ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. నిత్యం 40% నిల్వలు మిగిలిపోతుండగా ఎక్కువ కూరగాయలు కుళ్లిపోతున్నాయి. దీంతో రైతులు, వ్యాపారులు వాటిని పారబోస్తుండగా రోజుకు రూ. రూ.2 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రంలో కూరగాయల సాగు ఆలస్యమవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా రేట్లు విపరీతంగా పెరిగాయి. బీన్స్, పచ్చిమిర్చి KG రూ.150, చిక్కుడు రూ.100 పలుకుతున్నాయి.

Similar News

News July 6, 2025

టెస్టు చరిత్రలో తొలిసారి

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.

News July 6, 2025

పట్టు బిగించిన భారత్.. మరో 7 వికెట్లు తీస్తే..

image

ENGతో రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రాలే(0), డకెట్(25), రూట్(6) ఔటయ్యారు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే రేపు ఒక్కరోజే 536 రన్స్ చేయాలి. మరో 7 వికెట్లు తీస్తే టీమ్ ఇండియా గెలుస్తుంది. కాగా రెండో ఇన్నింగ్సులో భారత కెప్టెన్ గిల్ (161) సెంచరీతో మెరిశారు.

News July 6, 2025

ఊపిరి పీల్చుకున్న జపాన్

image

‘జపాన్ బాబా వాంగా’ <<16947282>>ర్యొ టట్సుకి<<>> జోస్యం చెప్పినట్లుగా ఇవాళ (జులై 5) జపాన్‌లో ఎలాంటి ప్రళయం సంభవించలేదు. అక్కడ 6వ తేదీ రావడంతో ఆ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ దేశంలో చిన్న భూకంపాలు తప్ప ఎలాంటి సునామీ రాలేదు. దీంతో టట్సుకి భవిష్యవాణి నిరాధారమైందని అక్కడి మేధావులు, సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. కాగా ర్యొ టట్సుకి జోస్యంతో జపాన్‌లో ప్రళయం వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.