News May 10, 2024

లార్డ్స్ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం పెంపు

image

అత్యంత పురాతనమైన లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్‌లోని లార్డ్స్ స్టేడియం సరికొత్త హంగులతో అందుబాటులోకి రానుంది. ఈ గ్రౌండ్ సీటింగ్ సామర్థ్యాన్ని మరో 1100 సీట్లకు పెంచేందుకు మెరైల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)కు చెందిన 18000 మంది ఆమోదించారు. 61.8 మిలియన్ పౌండ్ల ప్రాజెక్టులో భాగంగా 1930లో నిర్మించిన టావెర్న్ & అలెన్ స్టాండ్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం లార్డ్స్‌లో 31,180 సీటింగ్ కెపాసిటీ ఉంది.

Similar News

News January 4, 2026

ప్రియాంకకు బిగ్ రోల్.. అస్సాం గెలుపు బాధ్యత ఆమె చేతుల్లో!

image

అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పెద్ద బాధ్యత అప్పగించింది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. గెలిచే అవకాశం ఉన్న నేతలను షార్ట్‌లిస్ట్ చేయడం ఆమె ప్రధాన బాధ్యత. అక్కడ రాజకీయ పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న ప్రియాంకను రంగంలోకి దించడం ద్వారా క్యాడర్‌లో జోష్ నింపాలని పార్టీ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని ఆమె బలోపేతం చేయాల్సి ఉంటుంది.

News January 4, 2026

రోజూ 6-7 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

image

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 6 నుంచి 7 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 నుంచి 6 కేజీల ఎండుగడ్డి, 3 నుంచి 3.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 15-20 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.

News January 4, 2026

ESIC బిబ్వేవాడిలో 20 పోస్టులకు నోటిఫికేషన్

image

<>పుణే<<>>, బిబ్వేవాడిలోని ESIC హాస్పిటల్‌ 20 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, MD/DNB/DM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, SC,STలకు రూ.75. వెబ్‌సైట్: https://esic.gov.in/