News May 25, 2024

పెరగనున్న ఇంజినీరింగ్ సీట్లు

image

AP: ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్‌ను AICTE తొలగించింది. ఇప్పటివరకు ఒక్కో బ్రాంచిలో గరిష్ఠంగా 240 సీట్లు ఉండగా.. ఆ నిబంధన ఎత్తివేయడంతో చాలా కాలేజీలు అదనపు బ్రాంచిలకు అనుమతులు తీసుకుంటున్నాయి. మౌలికసదుపాయాలు, లెక్చరర్ల ఆధారంగా అదనపు సెక్షన్లను AICTE నేరుగా మంజూరు చేస్తోంది. దీంతో డిమాండ్ అధికంగా ఉండే CSE ఆ తర్వాత ECE, EEE సెక్షన్లలో ఇంజినీరింగ్ సీట్లు ఈ ఏడాది పెరగనున్నాయి.

Similar News

News January 17, 2026

అధైర్యపడొద్దు.. కార్యకర్తలకు రాజ్ ఠాక్రే పిలుపు

image

ముంబై మున్సిపల్ ఎన్నికల <<18877157>>ఫలితాల<<>> నేపథ్యంలో MNS అధినేత రాజ్‌ ఠాక్రే తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘మనం అపారమైన డబ్బు, అధికార బలంతో తలపడ్డాం. ఆశించిన ఫలితం రాకపోయినా అధైర్యపడొద్దు’ అని భరోసానిచ్చారు. మరాఠీ భాష, అస్తిత్వం కోసం పోరాడటమే మన ఊపిరి అని, గెలిచిన వారు ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. లోపాలను సరిదిద్దుకుని మళ్లీ అధికారంలోకి వద్దామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

News January 17, 2026

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.380 పెరిగి రూ.1,43,780కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,31,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు పెరిగి రూ.3,10,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి

News January 17, 2026

స్త్రీ ద్వేషులకు ప్రజలు బుద్ధి చెప్పారు: కంగనా

image

BMC <<18877157>>ఎన్నికల్లో<<>> మహాయుతి కూటమి గెలుపుపై నటి, MP కంగనా సంతోషం వ్యక్తం చేశారు. శివసేన(ఉద్ధవ్ వర్గం)కి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ‘స్త్రీ ద్వేషులు, బెదిరింపు రాజకీయాలు చేసేవాళ్లు, నెపోటిజం మాఫియాకి జనం తగిన స్థానాన్ని కట్టబెట్టారు. నా ఇంటిని అక్రమంగా కూల్చి మహారాష్ట్రను వదిలిపొమ్మని బెదిరించారు. ఇప్పుడు వాళ్లనే జనం వదిలేశారు’ అని పేర్కొన్నారు. 2020లో ఉద్ధవ్ హయాంలో అధికారులు కంగనా ఇంటిని కూల్చారు.