News May 25, 2024
పెరగనున్న ఇంజినీరింగ్ సీట్లు

AP: ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్‌ను AICTE తొలగించింది. ఇప్పటివరకు ఒక్కో బ్రాంచిలో గరిష్ఠంగా 240 సీట్లు ఉండగా.. ఆ నిబంధన ఎత్తివేయడంతో చాలా కాలేజీలు అదనపు బ్రాంచిలకు అనుమతులు తీసుకుంటున్నాయి. మౌలికసదుపాయాలు, లెక్చరర్ల ఆధారంగా అదనపు సెక్షన్లను AICTE నేరుగా మంజూరు చేస్తోంది. దీంతో డిమాండ్ అధికంగా ఉండే CSE ఆ తర్వాత ECE, EEE సెక్షన్లలో ఇంజినీరింగ్ సీట్లు ఈ ఏడాది పెరగనున్నాయి.
Similar News
News February 18, 2025
రేపటి నుంచే మెగా టోర్నీ.. గెలిచేదెవరో?

రేపటి నుంచి మార్చి 9 వరకు మెగా క్రికెట్ సమరం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. మరి ఈ టోర్నీలో విన్నర్స్, రన్నర్స్, అత్యధిక పరుగులు, వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎవరు నిలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. గత టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
News February 18, 2025
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. నిందితులకు ముగిసిన విచారణ

AP: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో నలుగురు నిందితులకు కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో వారి విచారణ జరగ్గా, ఇవాళ రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించట్లేదని, మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు కోరినట్లు సమాచారం.
News February 18, 2025
SHOCKING.. కుంభమేళాలో నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా

కుంభమేళా వేళ గంగా నదిలో నీటి నాణ్యతపై పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఆందోళన రేకెత్తించే అంశాలను వెల్లడించారు. ఈ నీళ్లలో చర్మానికి హానిచేసే కోలిఫామ్ బ్యాక్టీరియా పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లోని నీరు స్నానం చేయడానికి పనికిరాదని NGTకి తెలిపింది. ప్రతి 100mm నీటిలో 2,500 కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంటే స్నానం చేయవచ్చని CPCB చెబుతోంది. కాగా దీనిపై విచారణను NGT రేపటికి వాయిదా వేసింది.