News November 19, 2024

IND-CHINA: మానసరోవర్ యాత్ర, డైరెక్ట్ ఫ్లైట్స్‌పై చర్చ

image

కరోనా, ఆ తర్వాత తూర్పు లద్దాక్‌లో ఘర్షణల కారణంగా భారత్-చైనా మధ్య 2020 నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఆ విషయంలో పురోగతి కనిపిస్తోంది. జీ20 సమ్మిట్‌లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీ <<14650227>>భేటీలో<<>> విమానాల పునరుద్ధరణపై చర్చ జరిగింది. అలాగే చైనా సరిహద్దుల మీదుగా సాగే కైలాష్ మానసరోవర్ యాత్ర ప్రారంభంపైనా సానుకూల డిస్కషన్ జరిగింది.

Similar News

News March 13, 2026

ఫాంహౌస్ పాలసీ.. వచ్చే అసెంబ్లీలోనే బిల్లు

image

తెలంగాణలో ఫాంహౌస్‌ల నిర్మాణానికి ఓ ప్రత్యేక విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫాంహౌస్‌ల నిర్మాణం చట్టబద్ధం చేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురానుందట. విధివిధానాలు రూపొందించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పాలసీని ప్రవేశపెట్టాలని చూస్తోంది. కాగా ఆహ్లాదం కోసం, వీకెండ్ సెలవులో నివాసాలను వదిలి ఫాంహౌస్‌లకు చాలామంది వెళ్తుండటం తెలిసిందే.

News March 13, 2026

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ

image

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ మూడో విడత కింద రూ.4వేలు.. మొత్తంగా రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పెట్టుబడి సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది.

News March 13, 2026

FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ <<19369095>>మరోసారి<<>> తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,530 తగ్గి రూ.1,60,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,400 పతనమై రూ.1,47,300 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది.