News January 22, 2025
IND-ENG మ్యాచ్.. పిచ్ రిపోర్ట్

ఇవాళ భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 జరిగే కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. బౌండరీ చిన్నగా ఉండటంతో పరుగుల వరద పారనుంది. వాతావరణం విషయానికొస్తే రాత్రి పొగమంచు కురుస్తుంది. దీనివల్ల బంతి త్వరగా తడిగా మారి బౌలర్లకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. ఇది బ్యాటర్లకు ప్లస్ కానుంది. ఇక ఈడెన్ గార్డెన్స్ వద్ద వర్షం కురిసే అవకాశం లేదని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది.
Similar News
News February 10, 2025
రంగరాజన్‌పై దాడి దురదృష్టకరం: పవన్

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిని AP Dy.CM పవన్ ఖండించారు. ఇది దురదృష్టకరమని, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని చెప్పారు. దాడి వెనుక కారణాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తనకు రంగరాజన్ అనేక సూచనలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను పరామర్శించాలని TG జనసేన నేతలకు పవన్ సూచించారు.
News February 10, 2025
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వినియోగం

TG: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 16 వేల మెగావాట్లకు చేరువలో డిమాండ్ ఉంది. ఈ నెల 7న అత్యధికంగా 15,920 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. యాసంగి పంటలు, వేసవి ప్రభావంతో డిమాండ్ పెరిగింది. మరోవైపు, విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
News February 10, 2025
5 కిలోమీటర్లకు 5 గంటల సమయం

కుంభమేళాకు వెళ్లిన ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 300 కి.మీ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. 5 కి.మీ 5 గంటల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి ట్రాఫిక్ ఉండటంతో చాలామంది ఇంకా UPలోకే ఎంటర్ కాలేదు. ఇక త్రివేణీ సంగమానికి చేరుకోవడం గగనంలా మారింది. గంటలకొద్దీ వాహనాల్లోనే కూర్చోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.