News September 23, 2024

చైనా దూకుడుకు కళ్లెమేసే డిఫెన్స్ డీల్‌కు IND, US ఓకే

image

31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సిద్ధమైన భారత్‌ను అమెరికా స్వాగతించింది. $3.9 బిలియన్ల విలువైన ఈ అగ్రిమెంట్‌పై అక్టోబర్ లోపు 2 దేశాలూ సంతకాలు చేస్తాయని అంచనా. అధునాతన ఆయుధ వ్యవస్థల కో-ప్రొడక్షన్, ఇంటెలిజెన్స్, టెక్నాలజీ షేరింగ్ ఇందులో భాగం. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు వీటిని వాడతారని తెలిసింది. నేవీకి 15 సీ గార్డియన్స్, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు 16 స్కై గార్డియన్స్ డ్రోన్లు అందిస్తారు.

Similar News

News October 11, 2024

ప్రయాణికులకు ‘దసరా’ షాక్

image

AP: దసరాకు నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ దోచేస్తున్నాయి. ఇవాళ నాన్ AC బస్సుల్లో అదనంగా ₹700-1,000, AC బస్సుల్లో ₹1,000-2,000 వరకు గుంజుతున్నాయి. ఆదివారం తిరుగు ప్రయాణానికి రెండింతల రేట్లు పెంచేశాయి. ఉదా. HYD నుంచి కడపకు టికెట్ ధర ₹1,000 ఉండగా, ఇప్పుడు ₹2,000-3,000 లాగుతున్నాయి. ప్రత్యక్షంగానే దోపిడీ కనపడుతున్నా రవాణా శాఖ పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి.

News October 11, 2024

నీటి పారుదల శాఖకు రూ.284 కోట్లు విడుదల

image

AP: జలవనరుల ప్రాజెక్టుల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల కోసం నీటిపారుదల శాఖకు రూ.284.04 కోట్లు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఈ నిధులు విడుదల చేసింది. దీంతో కాలువలు, ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు వంటివి చేయనున్నారు. అంతకుముందు రూ.310 కోట్లతో ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ అంచనా వ్యయాన్ని పంపింది.

News October 11, 2024

GOOD NEWS.. వారికి బోనస్

image

కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-C ఉద్యోగులు, గ్రూప్-బి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చి 31లోపు ఉద్యోగంలో చేరిన, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలలు విధులు నిర్వహించిన వారు బోనస్‌కు అర్హులు. పనిచేసిన రోజులను బట్టి చెల్లింపులు ఉంటాయి. అర్హులైన ఉద్యోగులకు యావరేజ్‌గా రూ.6908 బోనస్ అందుతుంది. కేంద్ర పారామిలిటరీ, ఆర్మీ ఉద్యోగులూ అర్హులే.