News December 5, 2024
IND vs AUS: రెండో టెస్టుకు వరుణుడి గండం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ మ్యాచుకు వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తర్వాతి నాలుగు రోజుల్లో వాన పడే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. కాగా తొలి టెస్టులో భారత్ గెలిచి సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News January 18, 2025
అతనొక్కడే దోషి కాదు.. ట్రైనీ డాక్టర్ తల్లి
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ని కోర్టు దోషిగా తేల్చడంపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ దారుణం వెనుక మరికొందరు ఉన్నారని ఆమె ఆరోపించారు. వారికి కూడా శిక్ష పడ్డప్పుడే న్యాయం జరిగినట్లు భావిస్తామన్నారు. అప్పటివరకు తాము ప్రశాంతంగా నిద్రపోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
News January 18, 2025
రంజీ మ్యాచ్ ఆడనున్న రోహిత్‌శర్మ
ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. CT జట్టు ప్రకటన సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కొద్దిరోజుల క్రితం హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. జనవరి 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నారు. కాగా 2015లో చివరిసారి అతడు రంజీట్రోఫీలో ఆడారు.
News January 18, 2025
భారతీయుల ఆయుర్దాయం ఎంతంటే?
ప్రపంచంలోని వివిధ దేశాలను బట్టి ప్రజల సగటు జీవిత కాలం మారుతుంటుంది. హాంకాంగ్‌లో ఉండే ప్రజలు సగటున ఏకంగా 85 ఏళ్లు జీవిస్తారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ వెల్లడించింది. అత్యల్పంగా నైజీరియాలో 53 ఏళ్లు మాత్రమే జీవిస్తారని తెలిపింది. ఈ జాబితాలో మకావో(85), జపాన్(84), సౌత్ కొరియా(84), స్విట్జర్లాండ్(84), సింగపూర్(83), నార్వే(83), AUS(83), స్పెయిన్(83), ఇండియా(67), పాకిస్థాన్(66) ఉన్నాయి.