News September 18, 2024
IND vs BAN: రేపటి నుంచే తొలి టెస్టు
భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. 258 రోజుల తర్వాత రోహిత్, కోహ్లీ, బుమ్రా కలిసి టెస్టు ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఓవరాల్ ఓటముల కన్నా గెలుపుల సంఖ్య పెంచాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరో వైపు పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన ఊపులోనే భారత్‌పై కూడా గెలవాలని బంగ్లా తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఎవరు ఉండాలో కామెంట్ చేయండి.
Similar News
News October 9, 2024
JOE ROOT: ‘గే’ అని గేలి చేసినా..!
టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్‌ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.
News October 9, 2024
3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి
TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.
News October 9, 2024
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్
రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. ‘ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్’కు గాను డేమిస్ హసాబిస్, జాన్ ఎం.జంపర్‌లకు, ‘కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్’కు గాను డేవిడ్ బెకర్‌కు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది.