News December 24, 2024

IND vs PAK: కింగ్ కోహ్లీకి స్పెషల్ మ్యాచ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా మారనుంది. ఈ మ్యాచ్ ఆయనకు 300వ వన్డే కావడం విశేషం. విరాట్ ఇప్పటివరకు 295 వన్డేలకు ప్రాతినిధ్యం వహించారు. కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు.

Similar News

News December 25, 2024

వాజ్‌పేయి శత జయంతి

image

భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరుగాంచిన అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయింది. MPలోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న కృష్ణబిహారీ వాజ్‌పేయి, కృష్ణదేవి దంపతులకు ఆయన జన్మించారు. 1957లో తొలిసారి ఎంపీ అయిన వాజ్‌పేయి 5 దశాబ్దాల పాటు చట్టసభల్లో ఉన్నారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. అణు పరీక్ష, రోడ్లు, కార్గిల్ యుద్ధంలో విజయం, సంస్కరణలు ఇలా దేశానికి ఎంతో సేవ చేశారు.

News December 25, 2024

విపక్ష నేతగా ఉండి భారత ప్రతినిధిగా ఐరాసకు!

image

వాజ్‌పేయి పార్టీలకు అతీతంగా అభిమానం సొంతం చేసుకోవడంతో పాటు వ్యవహార‌శైలీ అలాగే ఉండేదని విశ్లేషకులు చెబుతారు. PV నరసింహారావు PMగా ఉన్నప్పుడు విపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయిని ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా పంపారు. ఆయనపై PVకి ఉన్న నమ్మకం అలాంటిది. పాక్‌ సేనలతో పోరాడి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన అప్పటి PM ఇందిరాను దుర్గాదేవితో పోల్చడం వాజ్‌పేయి భోళాతనానికి నిదర్శనమని రాజకీయవేత్తలు అంటారు.

News December 25, 2024

బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

image

బాక్సింగ్ డే టెస్టుకు AUS జట్టును ప్రకటించింది. గాయపడిన హెడ్ కోలుకొని జట్టులో కొనసాగుతున్నారు. రేపు ఉదయం 5గంటలకు(IST) మెల్‌బోర్న్‌లో టెస్ట్ ప్రారంభం కానుంది. 3వ టెస్టు డ్రా కావడంతో ప్రస్తుతం సిరీస్‌ 1-1 సమంగా ఉంది. ఈ టెస్టులో గెలుపు WTC ఫైనల్ చేరేందుకు ఇరుజట్లకు కీలకం కానుంది.
AUS PLAYING XI: ఖవాజా, కొన్ట్సస్, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, స్టార్క్, కమిన్స్ (కెప్టెన్), లయన్, బోలాండ్.