News December 24, 2024
IND vs PAK: కింగ్ కోహ్లీకి స్పెషల్ మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా మారనుంది. ఈ మ్యాచ్ ఆయనకు 300వ వన్డే కావడం విశేషం. విరాట్ ఇప్పటివరకు 295 వన్డేలకు ప్రాతినిధ్యం వహించారు. కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు.
Similar News
News January 18, 2025
కెప్టెన్సీ రేసు నుంచి హార్దిక్ పాండ్య ఔట్!
రోహిత్ శర్మ తర్వాత వన్డే, టీ20 జట్లకు హార్దిక్ పాండ్యకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ఒక దశలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే తరచూ గాయాల పాలవుతుండటం, నిలకడలేమితో బీసీసీఐ అతడిని పరిగణనలోకి తీసుకోవట్లేదు. భవిష్యత్తులోనూ అతని కెప్టెన్సీ కల కల్లగానే మిగిలిపోనుందని విశ్లేషకుల అంచనా. టీ20లకు సూర్య(కెప్టెన్), అక్షర్(VC)కు అవకాశం ఇవ్వగా, వన్డేల్లో రోహిత్‌కు డిప్యూటీగా గిల్‌ను ప్రమోట్ చేస్తోంది.
News January 18, 2025
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు STT గ్లోబల్ డేటా సెంటర్ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ సంస్థ రూ.3500 కోట్లతో మీర్‌ఖాన్‌పేట్‌లో ఆర్ట్ డేటా సెంటర్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుందని వెల్లడించారు. సింగపూర్ పర్యటన సందర్భంగా ఈ ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ సంస్థకు హైటెక్ సిటీలో ఇప్పటికే ఓ ఆఫీస్ ఉంది.
News January 18, 2025
సైఫ్‌పై దాడి.. నిందితుడి అరెస్ట్!
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దుర్గ్ రైల్వే స్టేషన్‌లో RPF పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి బయల్దేరారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ముంబైకి తరలించనున్నారు. షాలీమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో అతడు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.