News December 10, 2024

మహిళతో అసభ్య ప్రవర్తన.. స్పందించిన సీఎం

image

AP: విశాఖలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్ కోసం వచ్చిన మహిళ దుస్తులు విప్పించి సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సదరు వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మహిళలతో ఇలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా నిందితుడు ప్రకాశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.

Similar News

News January 16, 2025

KL రాహుల్, శాంసన్‌కు షాక్?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో WKలుగా KL రాహుల్, శాంసన్‌కు ఛాన్స్ దక్కకపోవచ్చని వార్తలొస్తున్నాయి. రాహుల్‌ను స్పెషలిస్ట్ WKగా ఆడించేందుకు సెలక్టర్లు ఆసక్తిగా లేరని, VHTలో ఆడకపోవడంతో శాంసన్ ఈ ఛాన్స్ కోల్పోయినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. WK స్థానానికి పంత్, జురెల్ ఎంపికవ్వొచ్చని అంచనా వేసింది. రానున్న రోజుల్లో శాంసన్ T20ల్లో, పంత్&జురెల్ టెస్ట్, ODIల్లో కొనసాగుతారని తెలిపింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.

News January 16, 2025

హిండెన్‌బర్గ్‌ను ఇప్పుడే ఎందుకు మూసేసినట్టు!

image

US షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్‌ షట్‌డౌన్ టైమింగ్‌పై చాలామందికి డౌట్ వస్తోంది. JAN 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. కొన్ని రోజుల క్రితమే హౌస్ జుడీషియరీ కమిటీలోని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడొకరు అదానీ, అతడి కంపెనీలపై కమ్యూనికేషన్, దర్యాప్తు పత్రాలు, ఆధారాలన్నీ పరిరక్షించాలని DOJను కోరారు. ఇక హిండెన్‌బర్గ్‌కు డీప్‌స్టేట్, డెమోక్రాట్స్, జార్జ్ సొరోస్, చైనా ఇంటెలిజెన్స్ సహకారంపై ఆరోపణలు ఉన్నాయి.

News January 16, 2025

రూ.1,00,00,000 ప్రశ్న.. జవాబు చెప్పగలరా?

image

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ క్రికెట్‌కు సంబంధించి రూ.కోటి ప్రశ్న వేశారు. 1932లో లార్డ్స్‌లో భారత్ ఆడిన తన తొలి టెస్టులో మొదటి బంతి ఎదుర్కొన్న బ్యాటర్ ఎవరు? అని క్వశ్చన్ అడిగారు. A.జనార్దన్ నవ్లే B.సోరాబ్జీ కోలాహ్ C.లాల్ సింగ్ D.ఫిరోజ్ పలియా అని ఆప్షన్స్ ఇచ్చారు. మరి మీరు సరైన సమాధానం ఏంటో చెప్పగలరా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్: A.