News April 15, 2024

ఆచితూచి వ్యవహరించిన భారత్

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతపై భారత్ ఆచితూచి వ్యవహరించింది. గత ఏడాది అక్టోబరు 7న హమాస్ దాడి చేసినప్పుడు భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గొడవ ఇరాన్‌తో కావడంతో భారత్ అప్రమత్తమైంది. మిడిల్‌ ఈస్ట్‌లో ఇరాన్ కీలక దేశం కావడం, ఆ ప్రాంతంలోని దేశాలతో భారత్ సత్సంబంధాలు కోరుకోవడమే ఇందుకు కారణం. అందుకే చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరాన్-ఇజ్రాయెల్‌కు భారత్ సూచించింది.

Similar News

News November 17, 2024

చికెన్ పులుసుతో జలుబు తగ్గుతుందా?

image

జలుబు చేసి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మసాలా దట్టించిన చికెన్ పులుసు కూర తినండి/సూప్ తాగండనే మాట తరుచూ వింటూ ఉంటాం. ఇందులో కొంత వరకు నిజం ఉందని నిపుణులు చెబుతున్నారు. కూరలో వాడే అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసుల కారణంగా కొంచెం ఉపశమనం కలుగుతుందని, ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయని పేర్కొంటున్నారు. అయితే జలుబు పూర్తిగా మటుమాయం కాదంటున్నారు.

News November 17, 2024

ఓడినా గెలిచాను: మైక్ టైసన్

image

జేక్ పాల్‌తో నిన్న జరిగిన బాక్సింగ్ మ్యాచ్‌లో తాను ఓడినప్పటికీ గెలిచినట్లేనని దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ట్వీట్ చేశారు. ‘ఆడినందుకు, ఓడినందుకు నాకు ఏమాత్రం బాధ లేదు. జూన్‌లో చావు అంచుల వరకూ వెళ్లాను. 8సార్లు రక్తం మార్చారు. సగం రక్తాన్ని కోల్పోయాను. మళ్లీ ఆరోగ్యవంతుడైనప్పుడే నేను గెలిచాను. నాకంటే సగం వయసున్న ఫైటర్‌తో 8 రౌండ్లు పోరాడి నిలబడటాన్ని నా బిడ్డలు చూశారు. నాకు అదే చాలు’ అని పేర్కొన్నారు.

News November 17, 2024

పుతిన్‌కు మస్క్ ఫోన్ కాల్.. విచారణకు డెమొక్రాట్ల డిమాండ్

image

ట్రంప్ ప్రభుత్వంలో <<14596564>>కీలక పదవి<<>> దక్కించుకున్న ఎలాన్ మస్క్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన అక్టోబర్‌లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఆ దేశ అధికారులతో అనధికారికంగా పలు ఒప్పందాలపై ఫోన్‌లో మాట్లాడినట్లు ఇద్దరు డెమొక్రటిక్ సెనేటర్లు ఆరోపించారు. ఈ క్రమంలో మస్క్‌పై జాతీయ భద్రతా కారణాలపై దర్యాప్తు చేయాలని లేఖ రాశారు. ఇలాంటి వ్యక్తికి GOVT ఎఫీషియెన్సీ బాధ్యతలు అప్పగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు.