News November 17, 2024

ఓడినా గెలిచాను: మైక్ టైసన్

image

జేక్ పాల్‌తో నిన్న జరిగిన బాక్సింగ్ మ్యాచ్‌లో తాను ఓడినప్పటికీ గెలిచినట్లేనని దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ట్వీట్ చేశారు. ‘ఆడినందుకు, ఓడినందుకు నాకు ఏమాత్రం బాధ లేదు. జూన్‌లో చావు అంచుల వరకూ వెళ్లాను. 8సార్లు రక్తం మార్చారు. సగం రక్తాన్ని కోల్పోయాను. మళ్లీ ఆరోగ్యవంతుడైనప్పుడే నేను గెలిచాను. నాకంటే సగం వయసున్న ఫైటర్‌తో 8 రౌండ్లు పోరాడి నిలబడటాన్ని నా బిడ్డలు చూశారు. నాకు అదే చాలు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 11, 2024

HYD: RTC బస్సు డిపోలన్నీ ప్రైవేటుపరం..?

image

సిటీలో ఎయిర్‌ పొల్యుషన్‌ను తగ్గించేందుకు డిజిల్‌ బస్సులను నగరం వెలుపలకి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో RTC ప్రైవేటీకరణ మొదలైందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని భావిస్తున్న సంస్థ.. ముందడుగు వేసింది. కండక్టర్ సేవలు మినహా మెయింటెనెన్స్ మొత్తం ప్రైవేట్‌ సంస్థలకే అప్పగించే ఛాన్సుంది. దీంతో సిటీ బస్సు డిపోలన్నీ ప్రైవేట్‌పరం కానున్నట్లు టాక్.

News December 11, 2024

మా నాన్న దేవుడు: మనోజ్

image

TG: కుటుంబం కోసం ఎంతో కష్టపడి పనిచేశానని మంచు మనోజ్ తెలిపారు. ‘మా నాన్న నాకు దేవుడు. ఇవాళ మీరు చూస్తున్న వ్యక్తి కాదు ఆయన. వేరేవాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. మా అన్న విష్ణు, వినయ్.. నాన్నపై గన్ను పెట్టి కాలుస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా? అది నచ్చక కుట్ర చేస్తున్నారు. నేను, నా భార్య ఎవరి పనివారు చేసుకుంటున్నాం.’ అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు.

News December 11, 2024

జర్నలిస్టుల ధర్నాకు మంచు మనోజ్ మద్దతు

image

సినీ నటుడు మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా పాల్గొని వారికి మద్దతు పలికారు. ‘మా నాన్న తరఫున నేను మీడియాకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి దారుణం. ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను ఆయనను ఎలాంటి ఆస్తులు అడగలేదు’ అని ఆయన పేర్కొన్నారు.