News December 8, 2024

భారత్ ఆలౌట్.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే..

image

డే నైట్ టెస్టులో తమకున్న తిరుగులేని రికార్డును ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది. అడిలైడ్ టెస్టులో ఘనవిజయం దిశగా సాగుతోంది. 175 పరుగులకే భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. మరోసారి నితీశ్ కుమార్ రెడ్డి(42) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు, కమిన్స్ 5, బోలాండ్ 3 వికెట్లు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 19 పరుగులు.

Similar News

News January 22, 2025

దారుణం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించాడు!

image

హైదరాబాద్ మీర్‌పేట్‌లో వెంకట మాధవి (35) అనే మహిళ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. ఆమెపై అనుమానంతో భర్త గురుమూర్తే చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు దర్యాప్తులో తేలింది. వాటిని కుక్కర్‌లో ఉడికించి, ఆ తర్వాత జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 18 నుంచి మాధవి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

News January 22, 2025

‘ఉబర్’లో కొత్త మోసం!

image

ప్రముఖ రైడ్ షేరింగ్ యాప్ ‘ఉబర్’పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. మొబైల్ ఛార్జింగ్ పర్సంటేజ్‌ను బట్టి ట్రిప్ ఛార్జిని నిర్ణయిస్తున్నట్లు ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఫుల్ ఛార్జింగ్ నుంచి తక్కువ పర్సంటేజ్ గల నాలుగు మొబైల్స్‌లో ఒకే లొకేషన్‌కు ఉబర్‌లో బుకింగ్స్ చెక్ చేశారు. ఛార్జింగ్ తక్కువగా ఉన్న మొబైల్‌లో ఎక్కువ, ఫుల్ ఛార్జి ఉన్నదాంట్లో తక్కువ ధర చూపించింది. ఈ మోసాన్ని మీరెప్పుడైనా గమనించారా?

News January 22, 2025

32,438 ఉద్యోగాలు.. పోస్టుల వారీగా

image

రైల్వేలో 32438 లెవల్-1 (గ్రూప్-డి) పోస్టులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అత్యధికంగా 13187 ట్రాక్ మెయింటెనర్, 5058 పాయింట్స్‌మన్-B, 3077 అసిస్టెంట్ (వర్క్ షాప్), 2587 అసిస్టెంట్ (C&W), 2012 అసిస్టెంట్ (S&T), 1381 అసిస్టెంట్ TRD ఉద్యోగాలు ఉన్నాయి. టెన్త్ పాస్ లేదా ఐటీఐ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.