News March 19, 2024
INDIA కూటమి హిందుత్వాన్ని అవమానిస్తోంది: మోదీ
హిందుత్వాన్ని అవమానించడంలో INDIA కూటమి నేతలు ఒక్క సెకన్ కూడా వృథా చేయరని ప్రధాని మోదీ ఆరోపించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఆ రాష్ట్రంలోని అధికార DMKపైనా విమర్శలు గుప్పించారు. DMK, కాంగ్రెస్ ఏ ఇతర విశ్వాసాలను టార్గెట్ చేయవని, హిందువులను మాత్రం అవమానిస్తాయని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. హిందుత్వంలో శక్తి అంటే మాతృశక్తి, నారి శక్తి అని ఆయన వివరించారు.
Similar News
News September 14, 2024
జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు
AP: నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై DGP ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. అప్పట్లో ఈ కేసును డీల్ చేసిన ACP కె.హనుమంతరావు, CI ఎం.సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు CIలు, ఒక SI పాత్ర ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపైనా చర్యలు తీసుకుంటారని సమాచారం. కాగా నిన్న ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీపై జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 14, 2024
1, 2 అంతస్తుల్లో ఉన్నవారికీ వరద సాయం
AP: రాష్ట్రంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న వరద ముంపు బాధితులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నవారికి కూడా సాయం అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపైన ఉన్న అంతస్తుల వారికీ కొంత సాయం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించనున్నారు.
News September 14, 2024
పటిష్ఠంగానే ‘రాజధాని’ పునాదులు?
AP: ఐదేళ్లుగా నీటిలో నానుతున్న రాజధాని అమరావతిలోని భవనాల పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని చెన్నై, HYD IIT నిపుణులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తుప్పు పట్టిన ఇనుము తొలగించి, కెమికల్ ట్రీట్‌మెంట్ చేసి నిర్మాణాలు కొనసాగించవచ్చనే నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా నిపుణులు ఇటీవల రాజధాని నిర్మాణాలను పరిశీలించిన విషయం తెలిసిందే.