News June 4, 2024
మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యం.. నవనీత్ రానా వెనుకంజ

మహారాష్ట్రలో ఇండియా కూటమి అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చింది. 26 సీట్లలో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఎన్డీయే 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో పోరు హోరాహోరీగా సాగుతోంది. సుప్రియా సూలే(NCP SP), నితిన్ గడ్కరీ (బీజేపీ) ఆధిక్యంలో ఉండగా, నవనీత్ రానా (బీజేపీ) వెనుకంజలో ఉన్నారు.
Similar News
News September 9, 2025
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు: హైకోర్టు

TG: గ్రూప్-1పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది. పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని, దాని ఆధారంగానే ఫలితాలు వెలువరించాలని TGPSCని ఆదేశించింది. అది సాధ్యం కాకపోతే పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలిపింది. అందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారందరికీ అవకాశం కల్పించాలని సూచించింది. 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది.
News September 9, 2025
ఎంపీలతో సీఎం రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. సరైన విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు.
News September 9, 2025
పిల్లలకు ఐఐటీ ఫౌండేషన్ క్లాసులు.. సైకాలజిస్టు ఏమన్నారంటే?

పిల్లలను IIT ఫౌండేషన్ కోర్సుల్లో చేర్పిస్తూ కొందరు ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని సైకాలజిస్ట్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘పిల్లల మెదడు/మనసు కొన్ని విషయాలని ఓ వయసు వచ్చేవరకూ అర్థం చేసుకోలేవు. దీన్ని సైకాలజిస్టు జీన్ పియాజే చాలా ఏళ్ల క్రితం అధ్యయన పూర్వకంగా నిరూపించారు. దానికి తగ్గట్లే బడిలో మన పాఠ్యాంశాలుంటాయి. ఇప్పుడు నువ్వు ఐదో తరగతిలో ఐఐటీ అంటే వెధవ ఎవడిక్కడ?’ అని విమర్శించారు.