News June 4, 2024

మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యం.. నవనీత్ రానా వెనుకంజ

image

మహారాష్ట్రలో ఇండియా కూటమి అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చింది. 26 సీట్లలో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఎన్డీయే 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో పోరు హోరాహోరీగా సాగుతోంది. సుప్రియా సూలే(NCP SP), నితిన్ గడ్కరీ (బీజేపీ) ఆధిక్యంలో ఉండగా, నవనీత్ రానా (బీజేపీ) వెనుకంజలో ఉన్నారు.

Similar News

News November 8, 2024

నా పోరాటం కొనసాగిస్తా: కేఏ పాల్‌

image

AP: తిరుమలను <<14559672>>కేంద్ర పాలిత ప్రాంతం<<>> చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై KA పాల్ స్పందించారు. ‘తిరుమల వ్యవహారంపై నా పోరాటం ఆపను. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. తిరుమలలో గొడవలు ఆగాలంటే కేంద్రం పాలిత ప్రాంతం చేయాల్సిందే. నా పిటిషన్‌ను విచారించిన ధర్మాసనానికి కృతజ్ఞతలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News November 8, 2024

‘పుష్ప-2’: స్పెషల్ సాంగ్‌లో శ్రీలీలతో పాటు మరో బ్యూటీ!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమాలోని స్పెషల్ సాంగ్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఈ సాంగ్‌లో నటిస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, సమంత సైతం అతిథిగా సాంగ్‌లో కనిపించాల్సి ఉందని, కానీ ఆమె ప్లేస్‌లో ఓ బాలీవుడ్ నటికి ఛాన్స్ వచ్చిందని వెల్లడించాయి. కాగా సాంగ్ షూట్‌తో సినిమా షూటింగ్ పూర్తికానుండగా DEC 5న మూవీ విడుదల కానుంది.

News November 8, 2024

మ్యూజిక్ డైరెక్టర్ స్థలం కబ్జా: ప్రభుత్వం స్వాధీనం

image

TG: సంగీత దర్శకుడు చక్రవర్తికి ఎన్టీఆర్ హయాంలో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నం.14లో 20 గుంటల స్థలం కేటాయించారు. ఈ స్థలంలో చక్రవర్తి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆయన కుమారుడు కూడా ఈ స్థలాన్ని గాలికొదిలేశారు. దీంతో 40 ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న రూ.65 కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. విషయం తెలుసుకున్న షేక్ పేట్ రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.