News December 11, 2024
EVMలపై సుప్రీంకోర్టుకు INDIA కూటమి
EVMల ట్యాంపరింగ్, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని INDIA కూటమి నిర్ణయించింది. హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో NDA రిగ్గింగ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాల్ని తారుమారు చేశారని ఆరోపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో VVPAT, EVM ఓట్లలో <<14842152>>వ్యత్యాసం లేదని<<>> ఎన్నికల సంఘం మంగళవారం స్పష్టం చేయడం గమనార్హం.
Similar News
News January 14, 2025
మహా కుంభమేళా: స్టీవ్ జాబ్స్ భార్యకు అలర్జీ
మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన ఆపిల్ కంపెనీ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ భార్య పావెల్ (61) అనారోగ్యానికి గురైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. భారీ జన సందోహం మధ్య నదిలో స్నానం చేయడంతో అలర్జీలు వచ్చినట్లు తెలిపింది. కాగా నిరంజని అఖారా సూచనతో పావెల్ ఇండియాకు వచ్చి, మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఆమెకు ఆ స్వామీజి ‘కమల’ అని నామకరణం చేశారు. పావెల్ భారత సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తున్నారని ఆయన చెప్పారు.
News January 14, 2025
ఆస్కార్స్ 2025: నామినేషన్స్ ప్రకటన వాయిదా
లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఆస్కార్స్-2025 నామినేషన్స్ ప్రకటన వాయిదా పడింది. ఓటింగ్ పీరియడ్‌ను పొడిగించారు. ఈనెల 17న నామినేషన్స్‌ను వెల్లడించాల్సి ఉండగా, 23వ తేదీకి వాయిదా వేశారు. ఆరోజున వర్చువల్‌గా నామినీల లిస్టును ప్రకటించనున్నారు. మార్చి 2న అవార్డులను ప్రకటిస్తారు.
News January 14, 2025
రూపాయి పతనం కొంత కాలమే: SBI రిపోర్ట్
భారత రూపాయి పతనంపై ట్రంప్ ప్రభావం కొంత కాలమే ఉంటుందని SBI రిపోర్ట్ పేర్కొంది. ఆయన ప్రెసిడెన్సీ ఆరంభంలో మన కరెన్సీకి ఒడుదొడుకులు ఎదురైనా త్వరలోనే స్థిరత్వం సాధిస్తుందని అంచనా వేసింది. చరిత్రను పరిశీలిస్తే డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్ల హయాంలోనే INR మెరుగ్గా రాణించిందని 2013 నాటి ‘టేపర్ తంత్రం’ను గుర్తుచేసింది. NOV నుంచి రూపాయి 3% బలహీనపడినా ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే ఇది అతి కనిష్ఠమని తెలిపింది.