News June 4, 2024
తమిళనాడులో క్లీన్ స్వీప్ దిశగా ఇండియా కూటమి!
తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డీఎంకే 21, కాంగ్రెస్ 9, VCK 2, సీపీఐ 2, సీపీఎం 2 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. PMK, MDMK, IUML ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
Similar News
News November 5, 2024
టెట్ దరఖాస్తులపై విద్యాశాఖ కీలక సూచన
TG: టెట్ దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సూచన చేసింది. సాంకేతిక కారణాలతో దరఖాస్తులు ఆలస్యమవుతుండడంపై స్పందించిన విద్యాశాఖ ఈనెల 7 నుంచి అప్లై చేసుకోవాలని సూచించింది. వాస్తవానికి నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తగా అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గడువు పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
News November 5, 2024
45 పైసలకే రూ.10 లక్షల బీమా
ప్రయాణికుల భద్రతకు భారతీయ రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో IRCTC కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో మార్పులు చేసింది. రైలు ప్రయాణం చేసేవారికి బీమా ప్రీమియం 45 పైసలుగా నిర్ణయించింది. ఇ-టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇది తప్పనిసరి చేసింది. అయితే టికెట్లు బుక్ చేసుకున్నా 5 ఏళ్ల లోపు వారిని ఈ పాలసీలోకి చేర్చలేదు. టికెట్ బుక్ చేసుకున్నాక బీమా కంపెనీ సైట్‌లో నామినీ వివరాలు సమర్పించాలి.
News November 5, 2024
IPL మెగా వేలం ఎక్కడంటే?
ఐపీఎల్ మెగావేలం ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆక్షన్ సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఆయా జట్లు రిటెన్షన్ జాబితాను సమర్పించాయి. ఈ మెగా వేలం కోసం 1,574 ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 320 మంది క్యాప్‌డ్, 1,224 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉన్నారు.