News September 9, 2024

భారత్, పాక్ తరచూ మ్యాచ్‌లు ఆడాలి: అజ్మల్

image

భారత్, పాకిస్థాన్ జట్లు తరచూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ అభిప్రాయపడ్డారు. ‘ఈ దేశాల మధ్య మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతాఇంతా కాదు. ఆఖరికి చంద్రుడిపై జరిగినా ఆ మ్యాచ్‌ చూసేందుకు జనం ఎగబడతారంటే అతిశయోక్తి లేదు. ఒకరి దేశంలో మరొకరు తరచూ ఆడాలి’ అని అభిలషించారు. భారత్ చివరిగా 2008లో ఆసియా కప్‌ కోసం పాక్‌లో పర్యటించింది. ఇక 2007 తర్వాత రెండు దేశాల మధ్య టెస్టులే జరగలేదు.

Similar News

News December 22, 2024

అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదు: పురందీశ్వరి

image

అల్లు అర్జున్, సీఎం రేవంత్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని, ఒక హీరోగా అర్జున్ అక్కడికి వెళ్లారని చెప్పారు. కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా ఏ11గా ఉన్న ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

News December 22, 2024

పుణ్యక్షేత్రాల్లో పెరిగిన రద్దీ

image

వారాంతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,411మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా హుండీకి రూ.3.44 కోట్ల ఆదాయం సమకూరింది. అటు యాదాద్రిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

News December 22, 2024

భారత్‌ను బలవంతం చేయలేరు: జైశంకర్

image

భారత్ ఎప్పుడైనా స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు. నిర్ణయాల్ని మార్చుకునేలా తమను వేరే దేశాలు ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. ‘స్వతంత్రంగా ఉండేందుకు, మధ్యస్థంగా ఉండటానికి మధ్య వ్యత్యాసం ఉంది. మాకెప్పుడూ భారత ప్రయోజనాలు, ప్రపంచ శాంతే ముఖ్యం. అందుకు అవసరమైన నిర్ణయాలే తీసుకుంటాం. భారతీయతను కోల్పోకుండా ఎదుగుతాం’ అని వివరించారు.