News February 16, 2025
బుమ్రా లేకపోయినా భారతే ఫేవరెట్: మైఖేల్ క్లార్క్

ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం కావడం భారత్‌కు లోటేనని ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చెప్పారు. అయితే జట్టు బలంగా ఉందని, బుమ్రా లేకపోయినా ఇండియానే ఫేవరెట్ అని అభిప్రాయపడ్డారు. టాప్-4లో భారత్ కచ్చితంగా ఉంటుందన్నారు. ‘గిల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ ఇటీవలే సెంచరీ చేశారు. ఇక హార్దిక్ పాండ్య ఒక సూపర్ స్టార్. అతను జట్టుకు X-ఫ్యాక్టర్ అవుతారు’ అని పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
నేటి ముఖ్యాంశాలు

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి
News July 6, 2025
టెస్టు చరిత్రలో తొలిసారి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.
News July 6, 2025
పట్టు బిగించిన భారత్.. మరో 7 వికెట్లు తీస్తే..

ENGతో రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రాలే(0), డకెట్(25), రూట్(6) ఔటయ్యారు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే రేపు ఒక్కరోజే 536 రన్స్ చేయాలి. మరో 7 వికెట్లు తీస్తే టీమ్ ఇండియా గెలుస్తుంది. కాగా రెండో ఇన్నింగ్సులో భారత కెప్టెన్ గిల్ (161) సెంచరీతో మెరిశారు.