News June 30, 2024

విశ్వవిజేతగా భారత్.. ఎమోషనల్ మూమెంట్స్

image

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్ టీ20 WCను ముద్దాడింది. ఆ అపురూప క్షణాల్లో భారత ఆటగాళ్లంతా ఉద్వేగానికి లోనయ్యారు. ఒకరినొకరు హత్తుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. వారిని చూస్తూ కోట్లాది భారతీయుల కళ్లు చెమర్చాయి. అభిమానులు జయజయధ్వానాలతో స్టేడియం మార్మోగగా.. వారికి రోహిత్ శర్మ అభివాదం చేస్తూ ఘన విజయాన్ని దేశానికి అంకితమిచ్చారు. భావోద్వేగం, ఆనందం, ఉల్లాసం అంటూ ఐసీసీ ఆ ఫొటోలను Xలో పోస్ట్ చేసింది.

Similar News

News October 6, 2024

ఆకస్మిక వరదలు.. ఒకే కుటుంబంలో ఏడుగురు సమాధి

image

భారీ వర్షాల కారణంగా మేఘాలయలో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. 24 గంటల వ్యవధిలో 10 మంది మరణించారు. సౌత్‌గారో హిల్స్ జిల్లాలోని గసుఆపారాలో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డాలు ప్రాంతంలో ముగ్గురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన సీఎం కాన్రాడ్ కె సంగ్మా వారికి వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

News October 6, 2024

జానీ మాస్టర్‌ అవార్డును ఆపడం మూర్ఖత్వమే: నటుడు

image

పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో జానీ మాస్టర్‌కు దక్కిన నేషనల్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ నిర్ణయాన్ని నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఖండించారు. ‘కేసు రుజువయ్యేవరకు జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. మీరేమి పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా. తన కొరియోగ్రఫీ టాలెంట్‌కు, తన వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏంటి? ఇది మూర్ఖత్వమే. సారీ’ అని ట్వీట్ చేశారు.

News October 6, 2024

అది ఐపీఎల్ టోర్నీలోనే అతిపెద్ద మూవ్ అవుతుంది: ఏబీడీ

image

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ఆర్సీబీలో చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అదే జరిగితే ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే అతి పెద్ద మూవ్ కానుందని అభిప్రాయపడ్డారు. అయితే రోహిత్ ముంబైని వీడే అవకాశం 0.1శాతమేనని పేర్కొన్నారు. అది కూడా జరిగే అవకాశం లేదన్నారు. మరోవైపు గత సీజన్‌లో ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించిన సంగతి తెలిసిందే.