News September 22, 2024
చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్

చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారిగా స్వర్ణాన్ని గెలుచుకుని భారత్ చరిత్ర లిఖించింది. స్లోవేనియాతో జరిగిన చివరి రౌండ్లో వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్, ఇరిగేశీ జాన్ సుబెల్జ్‌ను అర్జున్ ఓడించారు. దీంతో ఇండియాకు స్వర్ణం ఖాయమైంది. అటు అమ్మాయిల బృందం కూడా స్వర్ణం గెలవడంతో భారత్‌కు ‘ఒలింపియాడ్ డబుల్’ సొంతమైంది.
Similar News
News October 17, 2025
RCBని అమ్మేయాలని ప్రయత్నాలు?

IPL: RCBని $2 బిలియన్లకు అమ్మేందుకు పేరెంట్ కంపెనీ Diageo ప్రయత్నాలు చేస్తోందని Cricbuzz తెలిపింది. IPLలో లిక్కర్ బ్రాండ్ల యాడ్లపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన రూల్స్ తేవడంతో లాభదాయకం కాదని భావిస్తున్నట్లు సమాచారం. అధార్ పూనావాలా (సీరమ్ ఇన్స్టిట్యూట్), పార్థ్ జిందాల్ (JSW గ్రూప్), అదానీ గ్రూప్, ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ, మరో రెండు అమెరికా ప్రైవేట్ సంస్థలు ఆర్సీబీని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయట.
News October 17, 2025
ONGCలో 2,623 అప్రెంటీస్ ఖాళీలు

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసైన వారు అర్హులు. వయసు 18-24 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 6. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వెబ్సైట్: <
News October 17, 2025
మైనింగ్ లీజుల్లో వడ్డెర్లకు 15% రిజర్వేషన్‌పై కసరత్తు

AP: మైనింగ్ లీజుల్లో వడ్డెర్లకు 15% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై క్యాబినెట్లో చర్చించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని మైనింగ్‌పై సమీక్షలో CM CBN అధికారులను ఆదేశించారు. సీనరేజి, ప్రీమియం మొత్తాల్లో వారికి 50% రాయితీ ఇవ్వాలని సూచించారు. తవ్వకాలపై శాటిలైట్ చిత్రాలతో అంచనా వేయాలని చెప్పారు. ఒడిశా మాదిరి వాల్యూ ఎడిషన్ చేస్తే మైనింగ్ ద్వారా ₹30వేల కోట్ల ఆదాయం వస్తుందని సూచించారు.