News February 4, 2025

UNకు డబ్బు సాయం చేసిన భారత్

image

UN రెగ్యులర్ బడ్జెట్ 2025 కోసం భారత్ $37.64 మిలియన్లు చెల్లించింది. సరైన సమయంలోగా డబ్బులిచ్చిన 35 గౌరవ సభ్యదేశాల సరసన నిలిచింది. UN కమిటీ 30 రోజుల గడువుతో JAN 31ని చివరి తేదీగా ప్రకటించింది. భారత్ ఆ లోపే డబ్బును అందించింది. దీంతో UN చీఫ్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫన్ డుజారిక్ ‘భారత్‌లోని మా మిత్రులకు ధన్యవాదాలు’ అంటూ సందేశం పంపారు. ఈ సంస్థ నిర్వహణకు ఏటా సభ్యదేశాలు డబ్బులు ఇస్తాయి.

Similar News

News February 11, 2026

మొదలైన పోలింగ్

image

TG: రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో పోలింగ్ మొదలైంది. సా.5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

News February 11, 2026

ఇవాళ వారికి వేతనంతో కూడిన సెలవు

image

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్మిక శాఖ వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు, షాపులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు ‘స్పెషల్ క్యాజువల్ లీవ్’ సైతం మంజూరు చేసింది.

News February 11, 2026

రోజ్‌ మేరీ ఆయిల్‌‌తో జుట్టుకు ఎన్నో లాభాలు

image

నల్లని, ఒత్తయిన జుట్టు కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. వాటికోసం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ వాడతారు. వాటిల్లో ఒకటే రోజ్ మేరీ ఆయిల్. ఇందులో ఐరన్‌, క్యాల్షియం, విటమిన్‌ బి ఉంటాయి. దీనిని వాడటం వల్ల జుట్టు కుదుళ్లకు లోపలి నుంచి పోషణ లభిస్తుంది. జుట్టు నిగనిగలాడుతూ కాంతిమంతంగా మారుతుంది. జుట్టు పెరుగుదలలో చక్కటి ఫలితాలుంటాయి. త్వరగా పొడిబారే జుట్టు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.