News July 30, 2024
క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడు లంకతో మూడో టీ20
భారత్- శ్రీలంక మధ్య ఇవాళ పల్లెకెలె వేదికగా మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా.. చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఒక్క మ్యాచైనా గెలిచి పరువు నిలుపుకోవాలని లంక ఆరాటపడుతోంది. సూర్య సేన మార్పుల్లేకుండానే బరిలో దిగే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Similar News
News October 8, 2024
రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లా బ్యాటర్
బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ తర్వాత ఈ ఫార్మాట్ ఆడబోనని తెలిపారు. వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2007లో అరంగేట్రం చేసిన ఆయన బంగ్లా తరఫున ఇప్పటివరకు 50 టెస్టులు, 232 వన్డేలు, 139 టీ20లు ఆడారు. మొత్తం 10,695 రన్స్ చేశారు. టెస్ట్ ఫార్మాట్‌కు 2021లో గుడ్ బై చెప్పారు.
News October 8, 2024
అదృష్టం: 32 ఓట్ల మెజార్టీతో గెలిచాడు!
హరియాణాలో బీజేపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారు. ఉచన కలాన్‌లో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ కాంగ్రెస్ క్యాండిడేట్ బ్రిజేంద్ర సింగ్‌పై 32 ఓట్ల తేడాతో గెలిచారు. దేవేందర్‌కు 48,968 ఓట్లు రాగా బ్రిజేంద్రకు 48,936 ఓట్లు పోలయ్యాయి. కాగా సాయంత్రం 5 గంటలకు ఈసీ లెక్కల ప్రకారం హరియాణాలో బీజేపీ 39 సీట్లలో గెలిచి, తొమ్మిదింటిలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 31 సీట్లలో గెలిచి, ఆరింట్లో లీడ్‌లో ఉంది.
News October 8, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA
AP: పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.