News August 4, 2024
కష్టాల్లో భారత్.. ఒక్కడే 6 వికెట్లు తీశాడు!

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కష్టాల్లో పడింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 152కే 6 వికెట్లు కోల్పోయింది. భారత్ విజయానికి 25 ఓవర్లలో 89 రన్స్ అవసరం. రోహిత్ 64, గిల్ 35, విరాట్ 14, శ్రేయస్ అయ్యర్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. దూబే, కేఎల్ రాహుల్ డకౌటయ్యారు. ప్రస్తుతం అక్షర్ (26*), సుందర్ (2*) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్ వండర్సే ఒక్కడే 6 వికెట్లు తీశారు.
Similar News
News January 1, 2026
ఈ దశలో మామిడికి తప్పక నీరు అందించాలి

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రకాల మామిడి చెట్లలో ఇప్పటికే పూమొగ్గలు కనిపిస్తున్నాయి. ఇలా పూమొగ్గలు ఏర్పడి, అవి పెరుగుదల దశలో ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడి ఇవ్వాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిందె ఏర్పడిన తర్వాత (బఠాణి గింజ సైజులో ఉన్నప్పుడు), ప్రతి 15-20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలని చెబుతున్నారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి వ్యవసాయ నిపుణుల సూచనలు తీసుకోవాలి.
News January 1, 2026
న్యూ ఇయర్ రోజున ఈ పనులు వద్దు: పండితులు

కొత్త ఏడాది మొదటి రోజున మనం చేసే పనులు ఆ ఏడాదంతా మనపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఇంట్లో గొడవలు, వాదనలకు దూరంగా ఉండాలని, అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని సూచిస్తున్నారు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని అంటున్నారు. ‘నలుపు దుస్తులు వద్దు. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది. ఏడిచినా, విచారంగా ఉన్నా ఏడాదంతా అదే కొనసాగుతుంది’ అంటున్నారు.
News January 1, 2026
BEL 51పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


