News September 12, 2024

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు భారత్

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు సెమీస్‌కు చేరింది. కొరియాపై నేడు జరిగిన మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో గెలుపొంది లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్‌లో అడుగు పెట్టింది. టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా దిగిన భారత్, లీగ్ దశలో ఇప్పటి వరకూ ఓడిపోలేదు. హర్మన్‌ప్రీత్ సేన ఈ నెల 14న లీగ్ చివరి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుండటం గమనార్హం.

Similar News

News August 30, 2025

ఆగస్టు 30: చరిత్రలో ఈ రోజు

image

1871: భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం
1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం
1936: సినీ నటి జమున జననం (ఫొటోలో)
1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మరణం
1980: తెలుగు, హిందీ నటి రిచా పల్లాడ్ జననం
1994: సినీ హీరోయిన్ నందిత రాజ్ జననం

News August 30, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 30, 2025

జపాన్‌తో కలిసి చంద్రయాన్-5 ప్రయోగం: మోదీ

image

చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్-5 మిషన్‌ను జపాన్‌తో కలిసి ప్రయోగిస్తామని PM మోదీ ప్రకటించారు. ఇరు దేశాల అంతరిక్ష సంస్థలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఈ భాగస్వామ్యం జపాన్ అత్యాధునిక సాంకేతికతను, పరిశోధనా పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు దోహదపడనుంది. ఈ మిషన్‌లో ల్యాండర్‌ను భారత్, రోవర్‌ను జపాన్ నిర్మించనుంది. 2027లో చంద్రయాన్-4 మిషన్ చేపట్టాక దీనిని జపాన్ నుంచి ప్రయోగిస్తారు.