News September 12, 2024
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు భారత్
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు సెమీస్‌కు చేరింది. కొరియాపై నేడు జరిగిన మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో గెలుపొంది లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్‌లో అడుగు పెట్టింది. టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా దిగిన భారత్, లీగ్ దశలో ఇప్పటి వరకూ ఓడిపోలేదు. హర్మన్‌ప్రీత్ సేన ఈ నెల 14న లీగ్ చివరి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుండటం గమనార్హం.
Similar News
News October 4, 2024
విజయ్ ‘దళపతి 69’ షురూ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఖరి చిత్రం ‘దళపతి69’ పూజా కార్యక్రమం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2025లో ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. హెచ్ వినోద్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తారు. బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తారు. అనిరుధ్ సంగీతం అందిస్తారు.
News October 4, 2024
ఎవరు పెద్ద హీరో?.. సురేశ్ బాబు సమాధానమిదే
టాలీవుడ్‌లో బిగ్ స్టార్ ఎవరు? అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సురేశ్ బాబు ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘కలెక్షన్ల ఆధారంగా హీరోల స్థాయిని నిర్ణయించలేం. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ తదితర హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఏంతీసినా ప్రేక్షకులు చూస్తారని అనుకోకూడదు. వారి సినిమాలు కొన్ని అంచనాలను అందుకోలేదు. తెలుగులో రూ.100 కోట్లు సాధించే హీరోలు చాలామంది ఉన్నారు’ అని పేర్కొన్నారు.
News October 4, 2024
రేవంత్ మొనగాడు కాదు.. మోసగాడు: హరీశ్
TG: దేవుళ్లపై ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ మొనగాడు కాదు, మోసగాడని BRS మాజీ మంత్రి, MLA హరీశ్‌రావు విమర్శించారు. కుంటిసాకుతో రుణమాఫీ ఎగ్గొట్టి, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. దసరాలోపు రైతుబంధు పడకపోతే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు.