News January 23, 2025
ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్‌స్టాపబుల్: చంద్రబాబు

దావోస్‌లో పెట్టుబడులకు పోటీ పడుతున్నా అందరిదీ టీంఇండియాగా ఒకే లక్ష్యం అని AP CM చంద్రబాబు అన్నారు. ‘భారత్ నుంచి దావోస్‌కు హాజరవుతున్న వారిలో నేనే సీనియర్. 1997 నుంచి వస్తున్నాను. గతంలో భారత్‌కు గుర్తింపు తక్కువగా ఉండేది. ఇప్పుడు గొప్ప గుర్తింపు వచ్చింది. 2028నాటికి భారత్‌లో ఇంక్రిమెంటల్ గ్రోత్ ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్‌స్టాపబుల్’ అని దేశం తరఫున నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో CBN చెప్పారు.
Similar News
News February 19, 2025
ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ

ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కేంద్ర పరిశీలకులు భేటీ అయ్యారు. కాసేపట్లో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
News February 19, 2025
బ్యాక్టీరియా లేదు.. ఆ నీటిని తాగొచ్చు: యోగి

UP ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలో బ్యాక్టీరియా ఉందన్న వార్తలను సీఎం యోగి ఆదిత్యనాథ్ కొట్టిపారేశారు. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఆ చోటు పవిత్రమైందని.. ఆ నీళ్లను తాగొచ్చని చెప్పారు. సనాతన ధర్మం, గంగామాతపై ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని ఫైరయ్యారు. కాగా జనవరి 12, 13 తేదీల్లో మహాకుంభమేళా నీటిని పరిశీలించిన CPCB.. అందులో బ్యాక్టీరియా ఉందని, స్నానానికి పనికిరావని NGTకి నివేదిక ఇచ్చింది.
News February 19, 2025
‘ఐదుగురు స్పిన్నర్లెందుకు?’.. రోహిత్ స్ట్రాంగ్ రిప్లై

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ఐదుగురు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ జవాబిచ్చారు. ‘మీకు ఐదుగురు స్పిన్నర్లు కనిపిస్తున్నారు. కానీ నాకు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు కనిపిస్తున్నారు. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వల్ల బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అవుతుంది’ అని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ తమకెంతో ముఖ్యమని తెలిపారు.