News March 6, 2025
భారత్‌కు ఆదివారం భయం!

IND అభిమానులను ఆదివారం భయపెడుతోంది. ఇప్పటివరకు ICC ట్రోఫీల్లో ఆదివారం తప్ప మిగతా రోజుల్లో జరిగిన అన్ని ఫైనల్స్‌లో భారత్ గెలిచింది. 1983 (శనివారం), 2002 CT (సోమవారం), 2007 టీ20 WC (సోమవారం), 2011 వన్డే WC (శనివారం), 2013 CT (సోమవారం), 2024 టీ20 WC (శనివారం) కప్పులు సొంతం చేసుకుంది. 2000 CT, 2014 T20 WC, 2017 CT, 2003, 23 వన్డే WC ఫైనల్స్ ఆదివారం జరగ్గా భారత్ ఓడిపోయింది. ఈసారి CT ఫైనల్ ఆదివారమే మరి!
Similar News
News March 24, 2025
ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
News March 24, 2025
పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. అక్కడ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ వీటిని ఏర్పాటు చేసింది. అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని AP సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు TDP ఎంపీలు కోరగా లోక్‌సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలోనూ అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
News March 24, 2025
కాస్త తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.82,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గడంతో రూ.89,620కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,09,900గా ఉంది. కాగా, మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.1040 తగ్గడం గమనార్హం.