News August 10, 2024
భారత్ అత్యంత నమ్మకమైన దేశం: ముయిజ్జు

మాల్దీవుల నుంచి భారత్ జాడల్ని తరిమికొట్టాలంటూ ఒకప్పుడు పెద్ద ప్రచారాన్నే నిర్వహించిన ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన భాగస్వామి అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. ‘భారత్-మాల్దీవుల బంధం బలోపేతానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మా దేశానికి ఎప్పుడు అవసరం ఉన్నా భారత్ అండగా నిలిచింది. ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 10, 2026
ఈనెల 16 నుంచి వర్షాలు: వాతావరణ నిపుణులు

TG: రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 23 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ఛాన్సుందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈ నెల 15 వరకు పొడి వాతావరణం ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33-40 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.
News March 10, 2026
ఈ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా నో ఫైన్: నిర్మల

PMJDYతో సహా 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్‌కు కనీస నిల్వ నిబంధన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు. వీటికి మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఫైన్ ఉండదని, డిపాజిట్, విత్‌డ్రా, ATM సేవలకూ ఛార్జీలు ఉండవని తెలిపారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు. ఈ మేరకు లోక్‌సభలో రాత పూర్వక సమాధానం ఇచ్చారు.
News March 10, 2026
తగ్గనున్న మద్యం ధరలు.. ఎంతంటే?

AP: రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్, వైన్ బ్రాండ్ల ధరలను తగ్గించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. వాటి అమ్మకాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 20 ఖరీదైన బ్రాండ్ల మద్యం ధరలను తగ్గించనుంది. క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఒక్కో సీసాపై రూ.3వేల వరకూ తగ్గనున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రేట్లు తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.


