News August 26, 2024

పాక్ ఓటమికి భారతే కారణం: రమీజ్

image

బంగ్లా చేతిలో పాకిస్థాన్ <<13938635>>ఓటమికి<<>> భారతే కారణమని PCB మాజీ ఛైర్మన్ రమీజ్ రజా ఆరోపించారు. ASIA CUPలో పాక్ బౌలర్లపై IND పైచేయి సాధించడంతోనే జట్టు పతనం ప్రారంభమైందన్నారు. అప్పటి నుంచి తమ బౌలర్ల రహస్యాలు బహిర్గతమై మిగతా జట్లూ బౌలర్లను సులువుగా ఎదుర్కొంటున్నాయన్నారు. రజా కామెంట్స్‌పై భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘మిమ్మల్ని వేరే దేశాలు ఓడించినా మేమే కారణమా? సిగ్గుచేటు వ్యాఖ్యలు’ అని ఫైర్ అవుతున్నారు.

Similar News

News July 9, 2025

జులై 9: చరిత్రలో ఈరోజు

image

1875: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపన
1926: దివంగత మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య జననం
1927: దివంగత నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జననం(ఫొటోలో)
1930: దివంగత దర్శకుడు కె. బాలచందర్ జననం (ఫొటోలో)
1949: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావం
1966: గాయకుడు ఉన్నికృష్ణన్ జననం
1969: ‘పులి’ భారత జాతీయ జంతువుగా ప్రకటన
1969: మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు జననం

News July 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 9, 2025

విశాఖలో సత్వా వాంటేజ్ మిక్స్డ్ క్యాంపస్

image

AP: రియాలిటీ సంస్థ సత్వా గ్రూప్ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. బెంగళూరులో మంత్రి లోకేశ్ ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తర్వాత ఆసంస్థ 30ఎకరాల్లో రూ.1500 కోట్లతో వాంటేజ్ మిక్స్డ్ డెవలప్మెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ తెలిపారు. ANSR సంస్థ కూడా విశాఖలో GCC ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వంతో MOU చేసుకుంది.