News November 26, 2024
చిన్మయ కృష్ణదాస్ అరెస్ట్‌పై భారత్ ఆందోళన
చిన్మయ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడంపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘బంగ్లాలో హిందువులు సహా మైనారిటీలపై ఉగ్రమూకల దాడులు జరుగుతున్నాయి. వారిని దోచుకుంటున్నారు. గుళ్లను, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. నిందితుల్ని వదిలేసి శాంతియుతంగా డిమాండ్లు వినిపిస్తున్న కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయడం దురదృష్టకరం. మైనారిటీలకు బంగ్లా భద్రత కల్పించాలి’ అని పేర్కొంది.
Similar News
News December 26, 2024
కుప్పకూలిన విమానం.. పైలట్ చివరి మాటలివే..
నిన్న కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదానికి ముందు పైలట్ మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చాయి. ఉ.8.16 గంటలకు ఫ్లైట్‌ను పక్షి ఢీకొట్టిందని పైలట్ రాడార్‌కు సమాచారమిచ్చాడు. అయితే విమానాన్ని ఎడమవైపు ఆర్బిట్‌లో నడపాలని చెప్పగా ‘నా కంట్రోల్లో ఏమీ లేదు’ అని పైలట్ సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపటికే రాడార్‌తో సిగ్నల్స్ పూర్తిగా కట్ అయ్యాయి. ఆ తర్వాత అరగంటకే కజకిస్థాన్‌లోని ఆక్తావులో ఫ్లైట్ నేలను ఢీకొట్టింది.
News December 26, 2024
విద్యార్థులకు 11 రోజులు సెలవులు
వచ్చే నెల(JAN-2025)లో తెలంగాణ స్కూల్ విద్యార్థులకు 11 రోజులు సెలవులు ఉండనున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా JAN 1న, అలాగే 11 నుంచి 17 వరకు సంక్రాంతి హాలిడేస్. ఇవి 8 రోజులు కాగా మరో 3 ఆదివారాలు రానున్నాయి. దీంతో మొత్తం 31 రోజుల్లో 11 రోజులు విద్యార్థులు ఇంటి వద్దే ఉండనున్నారు. ఇక 2025 ఏడాదికి సంబంధించి ఇప్పటికే సెలవులను ప్రకటించిన ప్రభుత్వం 27 పబ్లిక్, 23 ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చింది.
News December 26, 2024
ఈ ఏడాది మరణించిన సినీ ప్రముఖులు వీరే..
భారతీయ సినీ ప్రపంచంలో 2024 పలు విషాదాలు నింపింది. DECలో తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్, దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్, ‘బలగం’ మొగిలయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. JUNEలో నిర్మాత, మీడియా మొఘల్ రామోజీరావు దివికేగారు. సంగీతకారుడు ఉస్తాద్ రషీద్ ఖాన్, గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్, నటులు రితురాజ్, డేనియల్ బాలాజీ, సూర్యకిరణ్, నటీమణులు సుహానీ భట్నాగర్, పవిత్రా జయరామ్, జానపద గాయని శారదా సిన్హా మరణించారు.