News March 18, 2024
ద్రవిడ్, రోహిత్ వల్లే WCలో భారత్ ఓటమి: కైఫ్

కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ వల్లే WC ఫైనల్లో భారత్ ఓడిందని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. పిచ్ విషయంలో వారిద్దరూ జోక్యం చేసుకుని స్లో పిచ్ ఇవ్వాలని క్యురేటర్లకు సూచించారని చెప్పారు. అదే టీమ్ఇండియా ఓటమికి పెద్ద కారణమని అభిప్రాయపడ్డారు. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ స్వభావం మారిపోయిందని, దీంతో వారు టార్గెట్ను సులభంగా ఛేదించారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Similar News
News September 15, 2025
ITR ఫైలింగ్ గడువు పొడిగింపు లేదు: IT శాఖ

ITR ఫైలింగ్కు గడువు పొడిగించలేదని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఐటీ విభాగం నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకోవాలని తెలిపారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఇవాళే చివరి తేదీ. ఇప్పటివరకు దాదాపు 6 కోట్లకుపైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేశారు.
News September 15, 2025
కాంగ్రెస్తో పొత్తుకు తేజస్వీ బ్రేక్!

జాతీయ స్థాయిలో కూటమిగా ఉంటూ రాష్ట్ర ఎన్నికల్లో వేరుగా పోటీ చేసేందుకు ఇండీ కూటమి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. బిహార్లో ఉన్న 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఇండీ కూటమిలోని RJD ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో తేజస్వీ కాంగ్రెస్తో పొత్తుకు బ్రేక్ ఇచ్చారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో పంజాబ్, హరియాణా ఎన్నికల్లో ఆప్, పశ్చిమబెంగాల్లో TMC ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
News September 15, 2025
గ్రామాల్లో మహిళా ఓటర్లే అత్యధికం: ఈసీ

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లకు గానూ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను వెల్లడించింది. వీరిలో మహిళా ఓటర్లు 85,35,935 మంది కాగా పురుషులు 81,66,732 మంది ఉన్నారని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకుపైగా ఎక్కువని పేర్కొంది.