News March 18, 2024

ద్రవిడ్, రోహిత్ వల్లే WCలో భారత్ ఓటమి: కైఫ్

image

కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ వల్లే WC ఫైనల్‌లో భారత్ ఓడిందని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. పిచ్ విషయంలో వారిద్దరూ జోక్యం చేసుకుని స్లో పిచ్ ఇవ్వాలని క్యురేటర్లకు సూచించారని చెప్పారు. అదే టీమ్‌ఇండియా ఓటమికి పెద్ద కారణమని అభిప్రాయపడ్డారు. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ స్వభావం మారిపోయిందని, దీంతో వారు టార్గెట్‌ను సులభంగా ఛేదించారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Similar News

News October 11, 2024

నందిగం సురేశ్‌కు అస్వస్థత

image

AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ, భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్‌‌కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

News October 11, 2024

డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన కేజ్రీవాల్‌

image

అధికారంలోకొస్తే ఏడాదిలోపు విద్యుత్ ఛార్జీల‌ను స‌గానికి త‌గ్గిస్తాన‌న్న డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌పై EX CM కేజ్రీవాల్ స్పందించారు. ‘ఉచితాలు అమెరికా వ‌ర‌కు చేరుకున్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే, NDA పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమ‌లు చేస్తే BJP తరఫున ప్ర‌చారం చేస్తాన‌ని కేజ్రీవాల్ ఇటీవల స‌వాల్ విసిరారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై స్పందించడం వెనుక ఆయన BJPని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

News October 11, 2024

జపాన్‌ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం

image

2024 ఏడాదికి గానూ నోబెల్ శాంతి బ‌హుమ‌తి జపనీస్ సంస్థ నిహాన్ హిడాంక్యోను వ‌రించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 111 మంది స‌భ్యులు, 31 సంస్థ‌ల‌ను నోబెల్ శాంతి బ‌హుమ‌తి వ‌రించింది. ఈ ఏడాది పుర‌స్కారానికి 286 నామినేష‌న్ల‌ను ప‌రిశీలించిన క‌మిటీ నిహాన్ హిడాంక్యోను పుర‌స్కారానికి ఎంపిక చేసింది.