News June 1, 2024
T20 వరల్డ్‌కప్‌లో భారత్ మ్యాచ్‌లు
☞ జూన్ 5- భారత్* ఐర్లాండ్
☞ జూన్ 9- భారత్* పాకిస్థాన్
☞ జూన్ 12- భారత్* USA
☞ జూన్ 15- భారత్* కెనడా
☞ ☞ అన్ని మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి.
Similar News
News September 14, 2024
మా నాన్న పులిని చంపి, ఆ రక్తం నా ముఖంపై పూశారు: యోగ్‌రాజ్
తన వద్ద కోచింగ్‌లో చేరాలంటే చావుపై భయం వదిలేయాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘మా నాన్న నన్ను చావు భయం లేకుండా పెంచారు. పులి వేటకు నన్ను తీసుకెళ్లారు. పులిని చంపి నన్ను దానిపై కూర్చోబెట్టారు. దాని రక్తం నా ముఖానికి పూశారు. పులికూన గడ్డి తినదని ఆయన అన్న మాట నేనెప్పటికీ మర్చిపోలేను. అందుకే నా కొడుకును కూడా భయంలేనివాడిలా పెంచాను’ అని పేర్కొన్నారు.
News September 14, 2024
జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన జనసేనలో చేరుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన సొంత నియోజకవర్గం జగ్గయ్యపేటలో మున్సిపల్ ఛైర్మన్ సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా నియమిస్తారని టాక్ వినిపిస్తోంది.
News September 14, 2024
సముద్రంలో భారీ ‘దేవర’ కటౌట్
Jr.NTR ‘దేవర’ క్రేజ్ రోజురోజుకీ పీక్స్‌కు చేరుకుంటోంది. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ముంబైలోని దాదర్ చౌపటీ బీచ్ వద్ద సముద్రంలో భారీ ‘దేవర’ కటౌట్ ఏర్పాటు చేసింది. గణేశ్ నిమజ్జనం చేసేటప్పుడు ఈ కటౌట్ చూడవచ్చని దేవర టీమ్ ట్వీట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. Sept 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందీ చిత్రం.