News January 3, 2025
చైనా తీరుపై భారత్ నిరసన.. ఈ సారి ఏం చేసిందంటే?
చైనా కొత్త వివాదానికి తెరలేపింది. లద్దాక్ సమీపంలో చైనా 2 కొత్త కౌంటీల ఏర్పాటుపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. హోటన్ ప్రిఫెక్చర్ రీజన్‌లో ఈ కౌంటీలు ఏర్పాటు చేయగా, అవి లద్దాక్ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపట్టిన జలవిద్యుత్ ప్రాజెక్టుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల కింది రాష్ట్రాలు ప్రభావితం కాకూడదని సూచించింది.
Similar News
News January 21, 2025
జనవరి 28న ఆ స్కూళ్లకు సెలవు
తెలంగాణలో జనవరి 28న మైనార్టీ స్కూళ్లకు సెలవు ఉండనుంది. ముస్లిం క్యాలెండర్ ప్రకారం ఆ రోజు ‘షబ్ ఎ మెరజ్’ కావడంతో ప్రభుత్వం ఇప్పటికే ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో మైనార్టీ విద్యాసంస్థలు ఈ సెలవును ఇవ్వనుండగా మిగతా స్కూళ్లు క్లాసుల నిర్వహణ లేదా హాలిడేపై సొంతంగా నిర్ణయం తీసుకోనున్నాయి.
News January 21, 2025
ఎల్లుండి ‘తండేల్’ థర్డ్ సింగిల్ విడుదల
హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ‘తండేల్’ సినిమా థర్డ్ సింగిల్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘హైలెస్సో.. హైలెస్సా’ అంటూ సాగే ఈ సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సాంగ్‌ను మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్, అజిజ్ నకాశ్ పాడగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. కాగా, వచ్చే నెల 7న ‘తండేల్’ విడుదల కానుంది.
News January 21, 2025
అమరావతిలో CII సెంటర్ ఏర్పాటు: చంద్రబాబు
AP: టాటా సంస్థ సహకారంతో రాజధాని అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ట్రైనింగ్, అడ్వైజరీ సేవలతో ఇండస్ట్రీల్లో కాంపిటీషన్ పెంచుతాం. భారత్ 2047 విజన్ కోసం ముందుకు వెళ్తాం. సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగాలి’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.