News September 22, 2024

2025 క్వాడ్ సమ్మిట్‌ ఆతిథ్యానికి భారత్ సిద్ధం: మోదీ

image

క్వాడ్ సమ్మిట్‌-2025కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధమని PM మోదీ అన్నారు. విల్మింగ్టన్‌ క్వాడ్ సమ్మిట్‌లో విదేశీ అధినేతలతో కలిసి పాల్గొన్నారు. 2021 నుంచి క్వాడ్ ఎంతో పురోగతిని సాధించిందని, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో క్వాడ్ అవసరం ఎంతో ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువల ప్రాతిపదికన దేశాలు కలిసి పనిచేయడం మానవాళికి ఎంతో ముఖ్యమన్నారు. కాగా క్వాడ్‌లో ఇండియా, US, జపాన్, ఆస్ట్రేలియా సభ్యదేశాలుగా ఉన్నాయి.

Similar News

News October 7, 2024

అమెరికాలో 227కు చేరిన హెలీన్ హరికేన్ మృతులు

image

అమెరికాలో హెలీన్ పెను తుఫాను గత నెలాఖరులో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో కలిపి 227 మృతదేహాల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేటగిరీ-4 తీవ్రతతో విరుచుకుపడిన హెలీన్ తన దారిలో ఉన్న ప్రతి దాన్నీ ధ్వంసం చేసింది. 2005లో వచ్చిన కత్రీనా తుఫాను తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనదని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేశారు.

News October 7, 2024

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ?

image

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే హోంమంత్రి సమావేశంలో వీరిద్దరూ పాల్గొంటారు. అనంతరం వీరిరువురూ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే రేవంత్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్తారు.

News October 7, 2024

భారత యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్

image

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా భారత యువతి పూజను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు పూజ ఇస్లాం మతాన్ని స్వీకరించనున్నట్లు రజా తెలిపారు. కాగా 32 ఏళ్ల హసన్ రజా పాక్ తరఫున ఒక వన్డే, 10 టీ20లు ఆడారు. అనంతరం ఆయన యూఎస్‌లో స్థిరపడ్డారు. పూజ ఫ్యామిలీ కూడా అక్కడే స్థిరపడింది.