News February 15, 2025
‘బార్బోన్ విస్కీ’పై టారిఫ్ తగ్గించిన భారత్

అమెరికాకు చెందిన మోస్ట్ పాపులర్ ‘బార్బోన్ విస్కీ’పై భారత ప్రభుత్వం టారిఫ్ రేటును తగ్గించింది. ఇదివరకు ఈ విస్కీ దిగుమతులపై 150% టారిఫ్ ఉండగా, దాన్ని 100%కి తగ్గించింది. మిగిలిన ఆల్కహాల్ ఉత్పత్తులపై 150% టారిఫ్ కొనసాగనుంది. 2023-24లో భారత్ 2.5 మి. డాలర్ల విలువైన బార్బోన్ విస్కీని దిగుమతి చేసుకుంది. భారత్ దిగుమతులపై అధిక టారిఫ్స్ వేస్తోందని ట్రంప్ విమర్శించిన తర్వాతి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News March 27, 2025
అందరం అవయవదానం చేద్దాం.. సభలో కేటీఆర్ ప్రతిపాదన

TG: ఆర్గాన్ డొనేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కీలక ప్రతిపాదన చేశారు. సభ్యులంతా అవయవదానంపై ప్రతిజ్ఞ చేయాలని కోరారు. సభ నుంచే ప్రజలకు మంచి సందేశం పంపాలని ఆయన అన్నారు.
News March 27, 2025
అమిత్‌షాపై ప్రివిలేజ్ నోటీసు తిరస్కరించిన RS ఛైర్మన్

HM అమిత్ షాపై కాంగ్రెస్ ఇచ్చిన సభా హక్కుల తీర్మానం నోటీసును రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. సోనియా గాంధీపై ఆయన విమర్శల్లో తప్పేమీ లేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రెసిడెంటుగా సోనియా గాంధీ విపత్తు నిధి డబ్బులను వాడుకున్నారు. PMNRF కమిటీలో PM, కాంగ్రెస్ Prez ఉండేలా అప్పటి PM నెహ్రూ ప్రకటించారు’ అని 1948 నాటి ప్రెస్ రిలీజును షా కోట్ చేశారు. దీనిని క్షుణ్ణంగా పరిశీలించానని ధన్‌ఖడ్ తెలిపారు.
News March 27, 2025
ఘోరం.. నలుగురు పిల్లల గొంతు కోసి తండ్రి ఆత్మహత్య

యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి భార్య కంతీదేవితో గొడవపడి, కోపంలో తన నలుగురు పిల్లల(స్మృతి, కీర్తి, ప్రగతి, రిషభ్) గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానూ భార్య చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలంతా 13 నుంచి 5 ఏళ్ల లోపు వారే. రాజీవ్ మెంటల్ హెల్త్ సరిగా లేదని పోలీసులు తెలిపారు.