News December 5, 2024
పాక్‌తో కలిసి భారత్ రెస్క్యూ ఆపరేషన్

గుజరాత్‌కు 270 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో చిక్కుకున్న MSV AI పిరాన్‌పిర్ నౌకా సిబ్బందిని భారత్, పాకిస్థాన్ కలిసి రక్షించాయి. ఆ నౌక గుజరాత్ పోర్టు నుంచి ఇరాన్‌కు బయలుదేరింది. సముద్రపు అలల ఉధ్ధృతికి బుధవారం మునిగిపోయింది. దాని నుంచి ఎమర్జెన్సీ సందేశం అందుకున్న భారత కోస్ట్‌గార్డ్ బలగాలు పాకిస్థాన్ తీరప్రాంత రక్షక బలగాలతో కలిసి 12మందిని రక్షించాయి. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
Similar News
News January 14, 2026
సిప్‌లో ఏటా పెరుగుతున్న పెట్టుబడులు!

సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2025లో మదుపరులు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో రూ.3.34 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. సురక్షిత పెట్టుబడి, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక సంపద సృష్టిగా ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కాగా 2023లో రూ.1.84 లక్షల కోట్లు, 2024లో రూ.2.68 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
News January 14, 2026
549 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

BSF స్పోర్ట్స్ కోటాలో 549 కానిస్టేబుల్(GD) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్ పాసై, శారీరక ప్రమాణాలు కలిగి, జాతీయ, అంతర్జాతీయ స్థాయులో క్రీడల్లో రాణిస్తున్నవారు అర్హులు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. PST, స్పోర్ట్స్ ప్రదర్శన, CV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే రూ.21,700-69,100. వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 14, 2026
సంప్రదాయ రుచుల సంక్రాంతి సంబరం

సంక్రాంతి అంటేనే పిండివంటల ఘుమఘుమలు. ఈ పండుగ నాడు పాలు పొంగించి చేసే పొంగలితో పాటు పరమాన్నం, పులిహోర, గారెలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంప్రదాయాలకు ప్రతీకగా అరిసెలు, బూరెలు, జంతికలు, సకినాలు, మురుకులు, లడ్డూలు చేసుకుంటారు. ఈ వంటలన్నీ ఇంటిల్లపాదికి సంతోషాన్ని పంచుతాయి. భోగభాగ్యాలతో, కొత్త ధాన్యపు రాశులతో ప్రతి ఇంటా సిరిసంపదలు కురిపిస్తూ, కొత్త కాంతులను విరజిమ్మాలన్నదే ఈ పండుగ ఇచ్చే సందేశం.


