News June 27, 2024

ఆయన కోసమైనా భారత్ WC గెలవాలి: సెహ్వాగ్

image

కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసమైనా టీ20 WC-2024ని టీమ్‌ఇండియా గెలవాలని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నారు. ‘సచిన్ కోసం 2011 ODI వరల్డ్‌కప్ గెలిచాం. ఇప్పుడు ద్రవిడ్ కోసం టీ20 WC గెలవాలి. ప్లేయర్‌గా ఆయనకు WC దక్కలేదు. కోచ్‌గా ఇప్పుడు గెలిచే ఛాన్సుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా భారత జట్టు కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ఈ టోర్నీ తర్వాత ముగియనున్న సంగతి తెలిసిందే.

Similar News

News October 12, 2024

‘రంజీ ట్రోఫీ’కి ఆ పేరు ఎలా వచ్చింది?

image

నవానగర్ (ప్ర‌స్తుత జామ్‌న‌గ‌ర్‌) గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ తీర ప్రాంతం. గ‌తంలో దీన్ని జ‌డేజా రాజ్‌పుత్ రాజ‌వంశీయులు పాలించేవారు. ఇక్కడి రాజును జామ్ సాహెబ్‌గా పిలుస్తారు. న‌వాన‌గ‌ర్‌ను 1907 నుంచి రంజిత్‌సిన్హ్ జీ విభా జీ పాలించారు. ఈయ‌న ప్రపంచ ప్ర‌సిద్ధ క్రికెట్ ఆట‌గాడు. ఇంగ్లండ్ తరఫున ఆడారు. ఈయ‌న పేరు మీదే దేశంలో ఏటా రంజీ ట్రోఫీ జ‌రుగుతుంది. ఈ రాజవంశం నుంచి ఎక్కువ మంది క్రికెటర్లుగా రాణించారు.

News October 12, 2024

DSP యూనిఫాంలో సిరాజ్.. పిక్ వైరల్!

image

భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా శుక్రవారం ఛార్జ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిరాజ్‌కు గ్రూప్-1 పోస్టు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ DGPని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు సూటు బూటులో ఉన్న సిరాజ్, ఈరోజు డీఎస్పీగా యూనిఫాం ధరించారు. ఆ పిక్స్ ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఆల్ ది బెస్ట్ మియా అంటూ నెట్టింట ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

News October 12, 2024

తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా అమలు చేస్తాం: మంత్రి తుమ్మల

image

TG: రైతు భరోసాకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మెగా పవర్ ప్లాంట్‌ను ఆయన సహచర మంత్రులతో కలిసి ప్రారంభించారు. పామాయిల్ పంటకు టన్నుకు రూ.20వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పామాయిల్ మొక్క అందేలా చూస్తామని తెలిపారు.