News July 11, 2024
భారత్-శ్రీలంక షెడ్యూల్ ఖరారు
భారత్-శ్రీలంక షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి టీ20, వచ్చే నెల 1 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 26న తొలి టీ20, 27న రెండో మ్యాచ్, 29న మూడో టీ20 జరగనుంది. అలాగే ఆగస్టు 1న తొలి వన్డే, 4న రెండో మ్యాచ్, 7న చివరి వన్డే జరగనుంది. కాగా ఈ సిరీస్‌లో భారత్ హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Similar News
News October 8, 2024
మంత్రిపై పరువు నష్టం కేసు.. విచారణకు నాగార్జున
TG: కాంగ్రెస్ మంత్రి సురేఖపై పరువు నష్టం కేసులో నేడు హీరో నాగార్జున విచారణకు హాజరు కానున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంటూ జడ్జి శ్రీదేవి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.
News October 8, 2024
అక్రమ కూల్చివేతలకు బ్రేక్!
TG: అక్రమ కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంపై హైడ్రా దృష్టి పెట్టిందని ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో 3 నెలలు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ఇచ్చిందని తెలిపాయి. అదే సమయంలో చెరువుల సర్వే పూర్తి చేసి, తదుపరి కార్యాచరణ రూపొందించాలని సర్కార్ ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News October 8, 2024
అందరి చూపు జమ్మూకశ్మీర్ పైనే..
దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో దేశం మొత్తం చూపు జమ్మూకశ్మీర్ వైపే ఉంది. ఇవాళ ఫలితాల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడవచ్చని చెప్పినా తమదే విజయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో హంగ్ ఏర్పడితే గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. దీంతో బీజేపీకి లాభమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.