News January 14, 2025

కొత్త రైలు ఇంజిన్‌తో ప్రపంచాన్ని స్టన్‌చేసిన భారత్!

image

భారత్ మరో అద్భుతం చేసింది. US సహా ప్రపంచాన్ని స్టన్‌ చేసింది. తొలిసారిగా 1200 హార్స్‌పవర్‌తో నడిచే హైడ్రోజన్ రైల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. మరికొన్ని రోజుల్లోనే ట్రయల్ రన్ చేపట్టనుంది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, జర్మనీలోనే ఇలాంటి రైలు ఇంజిన్లు ఉన్నాయి. వాటి సామర్థ్యమూ 500-600HPS మధ్యే ఉంటుంది. భారత్ మాత్రం 1200HPS, 140KMSతో అబ్బురపరిచింది. వీటికి డీజిల్, కరెంటు అవసరం లేదు. కాలుష్యం వెలువడదు.

Similar News

News February 16, 2025

పూరీ-గోపీచంద్ కాంబోలో మూవీ?

image

లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త మూవీపై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫోకస్ చేశారు. ఇటీవలే హీరో గోపీచంద్‌కు ఓ కథ వినిపించినట్లు సమాచారం. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా గోపీచంద్ చివరి 3 చిత్రాలు(రామబాణం, భీమా, విశ్వం) బాక్సాఫీస్‌ను మెప్పించలేకపోయాయి.

News February 16, 2025

IPL-2025 క్వాలిఫయర్స్, ఎలిమినేటర్ ఎక్కడంటే?

image

IPL-2025లో కీలక మ్యాచ్‌లకు HYD, కోల్‌కతా వేదికలు కానున్నాయి. క్వాలిఫయర్-1 మే 20న, ఎలిమినేటర్ మే 21న HYDలో జరగనున్నాయి. క్వాలిఫయర్-2 మే 23న, ఫైనల్ మే 25న కోల్‌కతాలో నిర్వహించనున్నారు. క్వాలిఫయర్-1లో గెలిచిన టీం నేరుగా ఫైనల్ చేరనుండగా, ఓడిన టీంకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడాలి. మే 25న టైటిల్ విన్నర్ ఎవరో డిసైడ్ అవుతుంది.

News February 16, 2025

18 మంది దుర్మరణం.. కారణమిదే: రైల్వే శాఖ

image

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ‘నిన్న ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైంది. 14వ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇంతలో 12వ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేక రైలును ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడికి కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు. ఈ ఘటన దురదృష్టకరం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొంది.

error: Content is protected !!