News April 25, 2025

నేటి నుంచి భారత్ సమ్మిట్

image

TG: నేటి నుంచి హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు భారత్ సమ్మిట్ జరగనుంది. ‘డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్’ థీమ్‌తో జరిగే సదస్సులో హైదరాబాద్ డిక్లరేషన్ ఆమోదించడంతో పాటు ఒక తీర్మానం పాస్ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రైజింగ్ కాన్సెప్ట్‌ను ఈ వేదిక నుంచి ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రభుత్వం చూస్తోంది. ఉగ్రదాడి నేపథ్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు.

Similar News

News April 19, 2026

మూడు నెలల్లో 73,200 ఉద్యోగాలు ఉఫ్!

image

ఈ ఏడాదిలో తొలి మూడునెలల్లోనే 95 కంపెనీలు ఏకంగా 73,200 ఉద్యోగాల్లో కోత ప్రకటించినట్లు Layoffs.fyi వెల్లడించింది. ఏఐ వాడకం పెరగడం, కాస్ట్ కట్టింగే ఇందుకు కారణం. ఇందులో బడా కంపెనీలైన మెటా, ఒరాకిల్, స్నాప్, డిస్నీ కూడా ఉన్నాయి. ఒరాకిల్ దాదాపు 30వేల ఉద్యోగాలు కట్ చేసింది. ఇందులో భారత్‌లోనే 12వేల ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం. ఇక మెటాలో 2000+ ఉద్యోగాలు పోగా డిస్నీ 1000 మందిని తొలగించింది.

News April 19, 2026

రీఛార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్

image

కస్టమర్లకు భారతీ ఎయిర్‌టెల్ షాకిచ్చింది. రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. రూ.799 (1.5gb/రోజుకు) ప్లాన్ రేటును ఏకంగా రూ.100 పెంచేసి రూ.899గా నిర్ణయించింది. అటు రూ.859 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. పెంచిన రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

News April 19, 2026

సెన్సస్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!

image

AP: కేంద్రం చేపట్టిన జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని NTR జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రజలకు సూచించారు. సెన్సస్ సిబ్బందిమంటూ ఇళ్ల వద్దకు వచ్చి OTPలు అడిగితే చెప్పొద్దని, వేలిముద్రలు, ఐరిస్‌కు ఒప్పుకోవద్దని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే 1855 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కాగా ప్రస్తుతం <<19674967>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> జరుగుతుండగా, మే 1 నుంచి జనగణన మొదలవనుంది.