News March 27, 2024

ఫిలిప్పీన్స్‌కు భారత్ అండ, చైనా ఆగ్రహం

image

ఫిలిప్పీన్స్ సౌర్వభౌమత్వానికి అండగా నిలుస్తామని భారత్ ఆ దేశానికి హామీ ఇచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ ప్రాదేశిక జలాలను కూడా చైనా తమవేనంటూ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ హామీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరోవైపు చైనా భారత్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌత్ చైనా సీలో తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని తేల్చిచెప్పింది. ఆ విషయంలో మూడో దేశపు జోక్యం సరికాదని హితవుపలికింది.

Similar News

News March 26, 2026

యుద్ధం.. భారత్‌పై ఇరాన్ ఒత్తిడి!

image

యుద్ధం వల్ల దౌత్యపరంగా భారత్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. US, ఇజ్రాయెల్ దాడులను BRICS కూటమి ఖండించేలా చర్యలు తీసుకోవాలని భారత్‌ను ఇరాన్‌ కోరినట్లు సమాచారం. అయితే కూటమిలో ఇరాన్ ప్రత్యర్థులైన సౌదీ – UAE ఉండటం, అమెరికా-ఇజ్రాయెల్ కూడా మిత్రపక్షాలే కావడం భారత్‌కు సవాల్‌గా మారింది. దీంతో ఈ ఏడాది BRICSకు అధ్యక్షత వహిస్తున్న భారత్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.

News March 26, 2026

మార్కాపురం ప్రమాదం.. మొండి కత్తితో 8 మందిని కాపాడాడు

image

AP: మార్కాపురం <<19479058>>బస్సు ప్రమాద ఘటన<<>>లో ఓ వ్యక్తి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడారు. బస్సులో మంటలు చెలరేగగానే అక్కడే ఉన్న మొండికత్తితో అద్దాలు పగలగొట్టి ఎనిమిది మందిని బయటకు తోసేశారు. తర్వాత తాను కూడా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పొగ దట్టంగా వ్యాపించడంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయానని ఆయన తెలిపారు. కాగా ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.

News March 26, 2026

బ్రెయిన్‌లో ఆలోచనలు.. నిద్ర పట్టక పాట్లు!

image

ప్రస్తుతం చాలామంది ‘నిద్రలేమి’ సమస్యతో బాధపడుతున్నారు. రోజంతా బిజీగా ఉండటంతో రాత్రి మైండ్ రెస్ట్‌లోకి వెళ్లకపోవడంతో నిద్ర పట్టదు. దీన్నే ‘కాగ్నిటివ్ హైపర్- అలర్ట్‌నెస్’ అంటారు. కొన్ని జీవనశైలి మార్పులతో దీనిని అధిగమించవచ్చు. *నిద్రకు ముందు TV చూడొద్దు. *రోజూ ఒకే సమయానికి పడుకోండి. *గదిలో వెలుతురు ఉండొద్దు. *రాత్రి కాఫీ, టీ తాగకండి. *వ్యాయామం, వాకింగ్, మెడిటేషన్ చేస్తే హాయిగా నిద్రపడుతుంది.